iQOO Z10 Lite 5G: అందమైన సరికొత్త కలర్స్ తో లాంచ్ అవుతోంది.!
ఐకూ అప్ కమింగ్ Z10 సిరీస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి అడుగుపెడుతోంది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కలర్ వేరియంట్ సైతం కంపెనీ బయటకు వెల్లడించింది
ఈ స్మార్ట్ ఫోన్ జూన్ 18 వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతుంది
iQOO Z10 Lite 5G: ఐకూ అప్ కమింగ్ Z10 సిరీస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి అడుగుపెడుతోంది. ఈ ఫోన్ కోసం కంపెనీ చేపట్టిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలకమైన వివరాలతో పాటు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కలర్ వేరియంట్ సైతం కంపెనీ బయటకు వెల్లడించింది. ఈ ఐకూ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఈ ఫోన్ కలర్ వేరియంట్ మరియు ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లు కూడా తెలుసుకోండి.
SurveyiQOO Z10 Lite 5G: ఎప్పుడు లాంచ్ అవుతుంది?
ఈ స్మార్ట్ ఫోన్ జూన్ 18 వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిన తరువాత అమెజాన్ ఇండియా నుంచి సేల్ అవుతుంది. ఎందుకంటే, ఈ ఫోన్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తుంది. అందుకే ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజీ అందించిన టీజింగ్ చేస్తోంది.
iQOO Z10 Lite 5G: కలర్ వేరియంట్స్ ఏమిటి?
ఐకూ జెడ్ 10 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ ను రెండు కలర్ ఆప్షన్ లలో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ ను టైటానియం బ్లూ మరియు సైబర్ గ్రీన్ రెండు రంగుల్లో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ ప్రకటించింది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ యొక్క టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ తెలిపే ఇమేజ్ లను కూడా అందించింది.
Also Read: Vivo T4 Ultra: అల్ట్రా స్లిమ్ డిజైన్ మరియు 100x జూమ్ కెమెరాతో వస్తోంది.!
ఐకూ జెడ్ 10 లైట్ 5జి : కీలక ఫీచర్స్
ఐకూ జెడ్ 10 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ ను సెగ్మెంట్ లో అతి పెద్ద 6000 mah బ్యాటరీ కలిగిన స్మార్ట్ ఫోన్ గా తీసుకొస్తున్నట్లు ఐకూ చెబుతోంది. అంటే, ఈ ఫోన్ లాంచ్ అయ్యే ధరలో ఇదే ఈ బిగ్ బ్యాటరీ కలిగిన ఫోన్ అవుతుందని కంపెనీ ఉదేశ్యం. ఈ ఫోన్ కలిగిన అతిపెద్ద బ్యాటరీ తో 70 గంటల మ్యూజిక్ లేదా 22.7 గంటల వీడియో ప్లేబ్యాక్ లేదా 9 గంటల గేమింగ్ అందిస్తుందని ఐకూ టీజింగ్ ద్వారా తెలిపింది.

ఇక ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు కన్ఫర్మ్ అవుతుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్పీకర్లు ఉన్నట్లు కూడా ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ అల్ట్రా స్లిమ్ డిజైన్ ఉన్నట్లు కూడా ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా తెలుస్తుంది. ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో అందించేలా ఐకూ ప్లాన్ చేసినట్లు అంచనా వేస్తున్నారు.