Vivo T4 Ultra: అల్ట్రా స్లిమ్ డిజైన్ మరియు 100x జూమ్ కెమెరాతో వస్తోంది.!
వివో టి4 అల్ట్రా కీలకమైన ఫీచర్స్ రెగ్యులర్ గా విడుదల చేస్తోంది
Vivo T4 Ultra 100x సూపర్ జూమ్ కెమెరా కలిగి ఉంటుందని వివో టీజింగ్
వివో టి4 అల్ట్రా స్మార్ట్ ఫోన్ కేవలం 7.43mm మందంతో అల్ట్రా స్లిమ్ డిజైన్ కలిగి ఉంటుంది
Vivo T4 Ultra: వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో టి4 అల్ట్రా కీలకమైన ఫీచర్స్ రెగ్యులర్ గా విడుదల చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గొప్ప అల్ట్రా స్లిమ్ డిజైన్ మరియు 100x సూపర్ జూమ్ కెమెరా కలిగి ఉంటుందని వివో టీజింగ్ చేస్తోంది. కేవలం డిజైన్ మరియు కెమెరా మాత్రమే కాదు ప్రోసెసర్ తో పాటు మరిన్ని గొప్ప ఫీచర్స్ తో ఈ ఫోన్ లాంచ్ అవుతోందని వివో టీజింగ్ చేస్తోంది.
SurveyVivo T4 Ultra : కీలక ఫీచర్స్
వివో టి4 అల్ట్రా స్మార్ట్ ఫోన్ కేవలం 7.43mm మందంతో అల్ట్రా స్లిమ్ డిజైన్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 192 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుందని వివో చెబుతోంది. ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 1.5K రిజల్యూషన్ కలిగిన క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అవుతుంది. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ యొక్క చిప్ సెట్ వివరాలు కూడా వివో బయట పెట్టింది. వివో టి4 అల్ట్రా స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 9300+ చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఇది TSMC 3rd జన్ 4n చిప్ సెట్ మరియు ఇది 3.4Hz క్లాక్ స్పీడ్ తో 20 లక్షలకు పైగా AnTuTu స్కోర్ అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ AI సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ ఫోన్ కలిగిన కెమెరా విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో వివో కెమెరా బయోనిక్ స్పెక్ట్రమ్ కలిగిన 50MP Sony IMX921 OIS ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరా మరియు 50MP Sony 3x పెరిస్కోప్ కెమెరాలు ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా 100x డిజిటల్ జూమ్ సపోర్ట్ తో ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 10x మ్యాక్రో జూమ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అంటే, సుదీర్ఘ తీరాలు జూమ్ చేసి అందించడమే కాకుండా చిన్న చిన్న వస్తువులు సైతం చాలా దగ్గరగా జూమ్ చేసి అందిస్తుంది.
Also Read: End of Season Sale బెస్ట్ QLED స్మార్ట్ టీవీ డీల్స్ పై ఒక లుక్కేయండి.!
Vivo T4 Ultra : లాంచ్
వివో ఈ స్మార్ట్ ఫోన్ ను జూన్ 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ఆన్లైన్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ ఫోన్ కీలక ఫీచర్లు ఫ్లిప్ కార్ట్ అందించిన వివో టి4 అల్ట్రా టీజర్ పేజి నుంచి అందించింది.