AI Future Risks గురించి ఒళ్ళు గగుర్పొడిచే విషయాలు చెబుతున్న Chat GPT
AI ప్రపంచం మెల్లమెల్లగా స్థిరత్వాన్ని ఏర్పరచుకోవడం మనం చూస్తూనే ఉన్నాం
ఇది భవిష్యత్తులో ఎలా ఉంటుంది మరియు లాభ నష్టాలు ఏమిటో తెలుసుకోవాలని ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది
Chat GPT ని Ai తో భవిష్యత్తులో వచ్చే సమస్యల గురించి చెప్పమని అడగ్గా ఒళ్ళు గగుర్పొడిచే విషయాలు తెలిపింది
AI Future Risks: AI ప్రపంచం మెల్లమెల్లగా స్థిరత్వాన్ని ఏర్పరచుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే, ఇది భవిష్యత్తులో ఎలా ఉంటుంది మరియు లాభ నష్టాలు ఏమిటో తెలుసుకోవాలని ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే ఆసక్తి మరియు కుతూహలంతో ప్రస్తుతం అధిక శాతం వినియోగంలో ఉన్న Chat GPT ని Ai తో భవిష్యత్తులో వచ్చే సమస్యల గురించి చెప్పమని అడగ్గా ఒళ్ళు గగుర్పొడిచే విషయాలు తెలిపింది. ఫ్యూచర్ లో AI ఎలాంటి ప్రగతి సాధిస్తుంది మరియు దీంతో వచ్చే నష్టాలు లేదా సమస్యల గురించి కూడా విపులంగా సమాధానాలు ఇచ్చింది.
SurveyAI Future Risks ఏమిటి?
ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) అన్ని రంగాల్లోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, అనేకమైన వ్యాపారాలు మరియు గవర్నెన్స్ వరకు కూడా చేతులు చాస్తోంది. అంతేకాదు, AI మరింత విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ఎఐ తో పనులు వేగం అవ్వడమే కాకుండా చాలా ఖచ్చితత్వంతో పనులు నిర్వహించే శక్తి కలిగి ఉండటంతో ఇది మరింత ఆదరణ అందుకుంది. అయితే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో మానవాళికి కొంత ముప్పు కూడా పొంచి ఉంది. ఈరోజు మనం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కలిగే అవకాశం ఉన్న భవిష్య ప్రమాదాల గురించి చూడనున్నాము. Chat GPT ని ఈ ప్రశ్న అడగ్గానే ఇచ్చిన సమాధానం మరింత విస్తారంగా మరియు సులభంగా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాము.
ఉద్యోగాలపై AI ప్రభావం
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఆటోమేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ, డ్రైవింగ్ మరియు మాన్యుఫాక్చరింగ్ వంటి చాలా రంగాల్లో ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా, కొత్త టెక్నాలజీ తో అప్గ్రేడ్ కానీ వారు మరియు కొత్త స్కిల్స్ నేర్చుకోనివారు నిరుద్యోగ నీడలో నడయాడే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది.
డీప్ ఫేక్ మరియు మిస్ ఇన్ఫర్మేషన్
డీప్ ఫేక్ మరియు మిస్ ఇన్ఫర్మేషన్ ఇప్పటికే మొదలయ్యింది మరియు ఇది భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అంటే, AI సహాయంతో నిజమైనదిగా అనిపించే ఫేక్ వీడియోలు మరియు తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇది రాజకీయ, మీడియా మరియు సామాన్య ప్రజల సామాజిక జీవనంలో గందరగోళం సృష్టించే ప్రమాదం ఉంటుంది.

AI పై ఎక్కువగా ఆధారపడటం
AI పై ఎక్కువగా ఆధారపడటం వలన మనుషుల సొంత ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. అంటే, AI తో ఆటోమేటిగ్గా జరిగే పనుల వలన మానవులు నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గిపోవడం మరియు ఆలోచనలు నిరుపయోగంగా మారిపోయే అవకాశం ఉంటుంది.
సైబర్ సెక్యూరిటీ
అన్నింటి కన్నా ముఖ్యమైనది సైబర్ సెక్యూరిటీ థ్రెట్ ప్రమాదం. ఎఐ కచ్చితమైన మరియు వేగవంతమైన పనితీరు వలన ఎఐ హ్యాకింగ్ ను మరింత కచ్చితంగా మరియు వేగంగా చేయగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఫిషింగ్ స్కామ్స్, పాస్ వర్డ్ బ్రేకింగ్ మరియు మరిన్ని ఆటోమేటెడ్ సైబర్ అటాక్ జరగడానికి ఆస్కారం ఉండవచ్చు.
Also Read: Moto Pad 60 Neo: మోటో పెన్ సపోర్ట్ మరియు 2.5K స్క్రీన్ తో లాంచ్ అవుతోంది.!
సూపర్ ఇంటెలిజెన్స్ AI
భవిషత్తులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గొప్పగా నిర్మించబడి సూపర్ ఇంటెలిజెన్స్ AI గా తయారైతే, అది మానవ నియంత్రణ నుంచి బయటకు వెళ్లే అవకాశం కూడా ఉండవచ్చని AI స్వయంగా చెబుతోంది. ఇదే విషయాన్ని చాలా మంది పరిశోధకులు కూడా హెచ్చరిస్తున్నారు.
AI Future Risks పరిష్కార మార్గాలు
అయితే, కొన్ని కఠినమైన నియమాలు మరియు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిధి నిర్ణయించే అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రభుత్వాలు AI ఎథిక్స్ అండ్ నియంత్రణ చట్టాలు అమలు చేయాలి. అలాగే, AI విధి విధానాలు మరియు దాని పనితీరు పై పారదర్శకత ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ముఖ్యమైన వ్యవస్థ నిర్వహించే సమయంలో మానవ పర్యవేక్షణ చేయాలి. సైబర్ థ్రెట్ కోసం కొత్త సైబర్ టెక్నాలజీ నిర్మాణం మరియు ఉద్యోగాల నష్టాన్ని భర్తీ చేయడం కోసం రీస్కిల్లింగ్ మరియు కొత్త ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ వంటి పనులు అమలు చేయాల్సి ఉంటుంది.
నాణేనికి రెండు వైపులా బొమ్మా బొరుసు ఉన్నట్లు, AI కూడా రెండు ముఖాలు కలిగి ఉంటుంది. ఒకటి మంచి కోసం ఉపయోగపడే అవకాశం అయితే రెండోది చెడు ప్రభావాలు కూడా ఉంటాయి. కాబట్టి, ఎఐ తో సరైన అవగాహన కలిగి ఉండటం అందరికీ మంచిది.