Sony Pulse Elevate: లైఫ్ లైక్ సౌండ్ మరియు బిల్ట్ ఇన్ మైక్ తో కొత్త స్పీకర్స్ అనౌన్స్ చేసిన సోనీ.!
ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ Sony Pulse Elevate అనౌన్స్ చేసింది
సెప్టెంబర్ 24న జరిగిన స్టేట్ ఆఫ్ ప్లే ఈవెంట్ నుంచి ఈ కొత్త స్పీకర్ అనౌన్స్ చేసింది
ఈ కొత్త స్పీకర్ సిస్టంను గేమింగ్ ప్రత్యేకంగా అందించింది
Sony Pulse Elevate; ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ కొత్త ఆడియో ప్రోడక్ట్ అనౌన్స్ చేసింది. అదే సోనీ కొత్తగా అనౌన్స్ చేసిన పల్స్ ఎలివేట్ వైర్లెస్ డెస్క్ టాప్ స్పీకర్. ఈ కొత్త స్పీకర్ సిస్టం ను లైఫ్ లైక్ సౌండ్ మరియు బిల్ట్ ఇన్ మైక్ వంటి మరిన్ని ఆధునిక ఫీచర్స్ తో ప్రకటించింది. సెప్టెంబర్ 24న జరిగిన స్టేట్ ఆఫ్ ప్లే ఈవెంట్ నుంచి ఈ కొత్త స్పీకర్ అనౌన్స్ చేసింది. ఈ వైర్లెస్ స్పీకర్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ వివరాలు ఇక్కడ ఉన్నాయి.
SurveySony Pulse Elevate: లాంచ్ ఎప్పుడు?
సోనీ పల్స్ ఎలివేట్ డెస్క్ టాప్ స్పీకర్ సిస్టం ను అనౌన్స్ మాత్రమే చేసింది, ఇంకా లాంచ్ చేయలేదు. ఈ కొత్త డెస్క్ టాప్ స్పీకర్ 2026 సంవత్సరంలో లాంచ్ చేయబోతున్నట్లు సోనీ ప్రకటించింది. ఈ కొత్త స్పీకర్ సిస్టంను గేమింగ్ ప్రత్యేకంగా అందించింది. ఇది PS5, MAC, PC మరియు మరిన్ని గేమింగ్ ప్లేయర్స్ కి సరిపోయేలా అందించింది. ఇది సరికొత్త డిజైన్ తో చాలా ప్రీమియం లుక్స్ కలిగి ఉంటుంది. ఈ కొత్త స్పీకర్ ధర వివరాలు కూడా సోనీ ఇంకా అనౌన్స్ చేయలేదు. వచ్చే సంవత్సరం ఈ స్పీకర్ లాంచ్ తర్వాత వీటి ధర తెలిసే అవకాశం ఉండవచ్చు.
Sony Pulse Elevate: ఫీచర్స్
సోనీ ఈ కొత్త స్పీకర్లను డెస్క్ టాప్ మరియు పోర్టబుల్ స్పీకర్ మాదిరిగా ఉపయోగించేలా కొత్త డిజైన్ తో అందించింది. ఇది జంట స్పీకర్ గా వస్తుంది మరియు చాలా స్మార్ట్ గా ఉంటుంది. ఈ స్పీకర్ కేవలం గేమింగ్ కోసం మాత్రమే కాదు జనరల్ యూసేజ్ కోసం కూడా సూపర్ గా ఉంటుంది అని సోనీ చెబుతోంది. ఇది మ్యూజిక్, మూవీస్ మరియు టీవీ షోస్ కోసం కూడా ఉత్తంగా ఉంటుందట. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ తో వైర్లెస్ గా కనెక్ట్ అవుతుంది కాబట్టి, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ మరిన్ని పరికరాలకు కనెక్ట్ చేసుకోవచ్చు.

ఇక స్పీకర్ సెటప్ విషయానికి వస్తే, ఇందులో Planar magnetic drivers కలిగి ఉంటుంది మరియు ప్రతి స్పీకర్ కూడా బిల్ట్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది. ఇది లైఫ్ లైక్ సౌండ్ అందిస్తుంది. గేమ్ క్రియేటర్స్ అందించిన ఒరిజినల్ సౌండ్ ఫీల్ ను ఈ స్పీకర్ అందిస్తుందని సోనీ తెలిపింది. అదనంగా, ఈ సోనీ స్పీకర్ Tempest 3D Audio Tech సపోర్ట్ తో నిజ జీవిత సౌండ్ ను తలపించే గొప్ప సౌండ్ అందిస్తుందట. ఇందులో బిల్ట్ ఇన్ మైక్ సెటప్ కూడా అందించింది AI ఆధారిత నోయిస్ రిజెక్షన్ ఫీచర్ తో కూడా ఉంటుంది.
Also Read: Sony Smart Tv పై జబర్దస్త్ డిస్కౌంట్ అందించిన అమెజాన్ సేల్.!
ఇది మల్టీ మరియు డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ స్పీకర్ పాటు ఛార్జింగ్ డాక్ ను కూడా అందిస్తుంది. ఇది గేమింగ్ ను అమితంగా ఇష్టపడే వారికి సూపర్ సరౌండ్ మరియు రియల్ లైఫ్ అందించే బెస్ట్ ఆప్షన్ అవుతుందని సోనీ తెలిపింది.