లేటెస్ట్ Amazon Echo Dot స్మార్ట్ స్పీకర్ పై అమెజాన్ జబర్దస్త్ అర్లీ డీల్ ప్రకటించింది.!

HIGHLIGHTS

Amazon Great Indian Festival 2025 అర్లీ డీల్స్ అనౌన్స్ చేసింది

లేటెస్ట్ Amazon Echo Dot 5 (5th Gen) స్మార్ట్ స్పీకర్ ని భారీ డిస్కౌంట్ తో అందుకోండి

అతి తక్కువ EMI ఆఫర్ ద్వారా కూడా తీసుకునే అవకాశం అందించింది

లేటెస్ట్ Amazon Echo Dot స్మార్ట్ స్పీకర్ పై అమెజాన్ జబర్దస్త్ అర్లీ డీల్ ప్రకటించింది.!

Amazon Great Indian Festival 2025 సేల్ స్టార్ట్ కావడానికి ఇంకా 10 రోజులు ఉండగా అమెజాన్ ఇండియా ఈరోజు బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. అర్లీ డీల్స్ లో భాగంగా ఈ బెస్ట్ డీల్ ను ప్రకటించింది. అదేమిటంటే, లేటెస్ట్ Amazon Echo Dot 5 (5th Gen) స్మార్ట్ స్పీకర్ ని అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో సేల్ ఆఫర్ చేయబోతున్నట్లు అమెజాన్ అనౌన్స్ చేసింది. ఈ అర్లీ బర్ద్ డీల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కంటే 10 రోజుల ముందు, అంటే సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon Echo Dot : డీల్

అమెజాన్ ఎకో డాట్ 5వ జనరేషన్ స్మార్ట్ స్పీకర్ ప్రస్తుతం రూ. 5,499 రూపాయల ప్రైస్ తో అమెజాన్ నుంచి సేల్ అవుతోంది. అయితే, సెప్టెంబర్ 13వ తేదీ అర్లీ బర్డ్ డీల్ ద్వారా ఈ స్మార్ట్ స్పీకర్ ను కేవలం రూ. 4,449 రూపాయల అతి తక్కువ ధరకు పొందవచ్చని అమెజాన్ ప్రకటించింది. అంటే, ఈ అమెజాన్ స్మార్ట్ స్పీకర్ పై రూ. 1,000 డిస్కౌంట్ అందుకోవచ్చు. అంతేకాదు, అతి తక్కువ EMI ఆఫర్ ద్వారా కూడా తీసుకునే అవకాశం అందించింది.

Also Read: AirPods Pro 3: సూపర్ ANC మరియు హార్ట్ రేట్ మోనిటర్ తో లాంచ్ చేసిన ఆపిల్.!

Amazon Echo Dot : ఫీచర్స్

ఈ అమెజాన్ ఎకో డాట్ స్మార్ట్ స్పీకర్ మోషన్ డిటెక్షన్ మరియు టెంపరేచర్ సెన్సార్ తో వస్తుంది. ఈ స్మార్ట్ స్పీకర్ అలెక్సా హాండ్స్ ఫ్రీ సపోర్ట్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా కలిగి ఉంటుంది. ఈ అమెజాన్ స్మార్ట్ స్పీకర్ డీప్ అండ్ బిగ్ సౌండ్ అందించే స్పీకర్ కలిగి ఉంటుంది. అమెజాన్ ఎకో డాట్ స్మార్ట్ స్పీకర్ అలెక్సా వాయిస్ కంట్రోల్ తో ఇంట్లోని ఏసీ, టీవీ మరియు స్మార్ట్ గీజర్ వంటి స్మార్ట్ పరికరాలు నడిపిస్తుంది.

Amazon Echo Dot

ఈ స్మార్ట్ స్పీకర్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ స్పీకర్ ఇంగ్లీష్ మరియు హిందీ రెండు భాషల్లో మాట్లాడుతుంది. ఇది వాల్యూమ్ బటన్, యాక్షన్ మరియు మైక్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ కలిగి ఉంటుంది. ఈ అమెజాన్ స్మార్ట్ స్పీకర్ ప్రైవసీ కంట్రోల్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ స్పీకర్ ని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo