AirPods Pro 3: సూపర్ ANC మరియు హార్ట్ రేట్ మోనిటర్ తో లాంచ్ చేసిన ఆపిల్.!
AirPods Pro 3: ఆపిల్ కొత్తగా ప్రీమియం ఎయిర్ బడ్స్ ను విడుదల చేసింది
ఈ ప్రీమియం బడ్స్ ను ప్రీమియం ఫీచర్స్ తో ప్రీమియం ప్రైస్ తో లాంచ్ చేసింది
ఈ కొత్త ఎయిర్ పోడ్స్ ను సూపర్ ANC మరియు హార్ట్ రేట్ మోనిటర్ తో లాంచ్ చేసింది
AirPods Pro 3: ఆపిల్ కొత్తగా ప్రీమియం ఎయిర్ బడ్స్ ను విడుదల చేసింది. అదే ఎయిర్ పోడ్స్ ప్రో 3 ఇయర్ బడ్స్ మరియు ఈ ప్రీమియం బడ్స్ ను ప్రీమియం ఫీచర్స్ తో ప్రీమియం ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ కొత్త ఎయిర్ పోడ్స్ ను సూపర్ ANC మరియు హార్ట్ రేట్ మోనిటర్ తో లాంచ్ చేసింది. ఇది రియల్ టైమ్ హార్ట్ రేట్ మోనిటర్ చేస్తుంది. మరి యాపిల్ లాంచ్ చేసిన ఈ కొత్త ఎయిర్ పాడ్స్ ధర మరియు ఫీచర్స్ వివరాలు తెలుసుకుందా.
SurveyAirPods Pro 3 ధర మరియు లభ్యత?
ఆపిల్ ఎయిర్ పోడ్స్ 3 ఇయర్ బడ్స్ ను రూ. 25,900 ధరతో లాంచ్ చేసింది. ఈ ఎయిర్ బడ్స్ ప్రీ ఆర్డర్స్ కూడా ఆపిల్ స్టార్ట్ చేసింది. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఈ బడ్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి. ఈ బడ్స్ పై మీకు నచ్చిన లేదా కావాల్సిన పేరు లేదా ఎమోజీలు ప్రింట్ చేసి యాపిల్ అందిస్తుంది. ఇది ఫీచర్ ముందు నుంచే అందుబాటులో ఉన్నా ఇప్పుడు కొత్త బడ్స్ తో ఈ అవకాశాన్ని ఉచితంగా ఆఫర్ చేస్తుంది.
Also Read: Amazon మరియు Flipkart పై భారీగా తగ్గనున్న Sony, LG మరియు Samsung Smart Tv ధరలు.!
AirPods Pro 3 : ఫీచర్స్
ఆపిల్ ఎయిర్ పోడ్స్ 3 ఇయర్ బడ్స్ ను మరింత గొప్ప ANC సపోర్ట్ తో అందించింది. ఇది వరల్డ్స్ బెస్ట్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ బడ్స్ గా నిలుస్తుందని ఆపిల్ చెబుతోంది. ఈ బడ్స్ ను వర్కవుట్ సమయంలో బర్న్ అయిన కెలోరీస్ లెక్కించే మరియు హార్ట్ రేట్ ను మోనిటర్ చేసే హార్ట్ రేట్ మోనిటర్ తో అందించింది. అంటే, ఈ బడ్స్ ను చెవులో పెట్టుకుని పాటలు వింటూనే మీ హెల్త్ చేని కూడా చేసుకోవచ్చు. ఇందులో మరింత ప్రీమియం సౌండ్ కోసం ప్రత్యేకమైన ఎయిర్ వెంట్ కూడా నిర్మించింది.

ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ ఎయిర్ పాడ్స్ ను డైనమిక్ హెడ్ ట్రాకింగ్ సపోర్ట్ కలిగిన స్పేషియల్ ఆడియో సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇందులో Live Translation ఫీచర్ కూడా అందించింది. ఇది కాకుండా లౌడ్ సౌండ్ రిడక్షన్ కూడా అందించింది. ఈ బడ్స్ Voice Isolation, ఫుట్ నోట్, హే సిరి మరియు సిరి ఇంటరాక్షన్ ఫుట్ నోట్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇది MagSafe ఛార్జ్ కేస్ USB‑C ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది ఆపిల్ వాచ్ చార్జర్, Qi‑certified ఛార్జర్స్ తో కూడా పని చేస్తుంది. ఈ బడ్స్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ పై సింగిల్ ఛార్జ్ తో 8 గంటల ప్లే టైమ్ అందిస్తుంది.