SnapChat యూజర్లకు పిడుగు లాంటి వార్త అందించిన కంపెనీ.!
SnapChat యూజర్లకు ఇప్పుడు కంపెనీ పిడుగు లాంటి వార్త అందించింది
ఉచిత సేవలు కాకుండా పేమెంట్ తో కూడిన ప్లాన్ ని అందించబోతున్నట్లు అనౌన్స్
స్నాప్ చాట్ ఉపయోగిస్తున్న యూజర్ అయితే ఈ కొత్త అప్డేట్ గురించి ఖచ్చితంగా తెలుసుకోండి
SnapChat యూజర్లకు ఇప్పుడు కంపెనీ పిడుగు లాంటి వార్త అందించింది. గొప్ప కెమెరా యాప్ గా పేరొందిన స్నాప్ చాట్ ఇప్పుడు యూజర్లకు ఉచిత సేవలు కాకుండా పేమెంట్ తో కూడిన ప్లాన్ ని అందించబోతున్నట్లు అనౌన్స్ చేసింది. నామమాత్రపు డేటా తో కూడిన ఉచిత ప్లాన్ కూడా ఉంది అనుకోండి. కానీ, ఎక్కువ స్టోరేజ్ కోరుకుంటే మాత్రం ప్రీమియం ప్లాన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా స్నాప్ చాట్ ఉపయోగిస్తున్న యూజర్ అయితే ఈ కొత్త అప్డేట్ గురించి ఖచ్చితంగా తెలుసుకోండి.
Surveyఏమిటా SnapChat పిడుగు లాంటి వార్త?
2016 లో విడుదలైన డిజప్పియరింగ్ ఫోటో అండ్ వీడియో మెసేజింగ్ యాప్ మరియు ఇది ప్రజలకు పరిచయం అయ్యి పది వసంతాలు అవుతుంది. ఈ యాప్ ఇప్పటి వరకూ కూడా ఉచిత సర్వీస్ మాత్రమే ఆఫర్ చేసింది. అయితే, ఇప్పుడు ఈ యాప్ యొక్క మెమొరీస్ సర్వీస్ కోసం ఉచిత స్టోరేజ్ పరిమితం చేసింది. ముందుగా ఈ సర్వీస్ కోసం అన్లిమిటెడ్ స్టోరేజ్ ఆఫర్ చేసింది. కానీ, ఇది ఇప్పుడు కేవలం 5 జీబీ లకు మాత్రమే పరిమితం చేసింది.
కొత్త ప్లాన్ కోసం ఎంత ఛార్జ్ చేస్తోంది?
ఈ కొత్త ప్రీమియం ప్లాన్స్ ప్రస్తుతానికి గ్లోబల్ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. అంతేకాదు గ్లోబల్ మార్కెట్ లో కూడా ప్రాంతాన్ని బట్టి ఈ ప్లాన్ ప్రైస్ లో మార్పులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో 5 జీబీ వరకు ఉచిత స్టోరేజ్ ఆఫర్ చేస్తుంది. అయితే, 5 జీబీ పైబడి స్టోరేజ్ కోరుకునే యూజర్లు ప్రీమియం ప్లాన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో 100GB ప్లాన్ కోసం నెలకు $1.99 (సుమారు రూ. 165), 250GB వరకు స్టోరేజ్ కోసం Snapchat+ ప్లాన్ ను $3.99 (నెలకు) (సుమారు రూ. 330) రేటును నిర్ణయించినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.

ఉచిత లిమిట్ స్టోరేజ్ దాటిన యూజర్లు ప్రీమియం ప్లాన్ కి మారాలని సూచించినట్లు మరియు 5 జీబీ కంటే అధిక స్టోరేజ్ ఉన్న వారికి 12 నెలల వరకు తాత్కాలిక స్టోరేజ్ అందిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ఆ తర్వాత ఉచిత స్టోరేజ్ కంటే మించి ఉన్న డేటా నిర్వీర్యం చేసే అవకాశం ఉండవచ్చని సూచిస్తున్నారు. అయితే, దీనిపై అఫీషియల్ స్టేట్మెంట్ ఇంకా బయటకు రాలేదు.
Also Read: BSNL eSIM: దేశవ్యాప్తంగా ఇ-సిమ్ సేవలకు శ్రీకారం చుట్టిన బిఎస్ఎన్ఎల్.!
ఈ కొత్త న్యూస్ వచ్చిన తర్వాత చాలా గ్లోబల్ మార్కెట్ లో ఉన్న చాలా మంది స్నాప్ చాట్ యూజర్లు, కంపెనీ చాలా స్వార్థంగా మారిందని సోషల్ మీడియా సాక్షిగా నిప్పులు చెరుగుతున్నారు. మరి ఇది ఇండియాలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికి, ఇండియన్ యూజర్ల గురించి అప్డేట్ బయటకు రాలేదు.