BSNL eSIM: దేశవ్యాప్తంగా ఇ-సిమ్ సేవలకు శ్రీకారం చుట్టిన బిఎస్ఎన్ఎల్.!
ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ శరవేగంగా తన సర్వీస్ లను విస్తరిస్తోంది
అన్ని ప్రాంతాల్లో కూడా తన నెట్వర్క్ విస్తరించాలని బిఎస్ఎన్ఎల్ ఆలోచనలో ఉంది
BSNL eSIM సర్వీస్ అందించడానికి సిద్ధమైనట్లు ప్రకటించింది
BSNL eSIM: ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ శరవేగంగా తన సర్వీస్ లను విస్తరిస్తోంది. ఇప్పటికే దేశం మొత్తం 4జి సేవలు ప్రకటించిన బిఎస్ఎన్ఎల్, 5G సేవలను కూడా త్వరగానే అందించాలని యోచిస్తుంది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరొక కొత్త సర్వీస్ ఆఫర్ చేయడానికి బిఎస్ఎన్ఎల్ సిద్ధమయ్యింది. అదే బిఎస్ఎన్ఎల్ ఇ-సిమ్ సర్వీస్ మరియు ఈ సర్వీస్ తో ఫిజికల్ సిమ్ కార్డు లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా తన నెట్వర్క్ విస్తరించాలని బిఎస్ఎన్ఎల్ ఆలోచనలో ఉంది.
SurveyBSNL eSIM:
ఇప్పటికే జియో మరియు ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు 5g సేవలతో పాటు ఇ-సిమ్ సర్వీస్ ని కూడా ఆఫర్ చేస్తున్నాయి. అయితే, ఎట్టకేలకు బిఎస్ఎన్ఎల్ కూడా తన ఇ-సిమ్ సర్వీస్ అందించడానికి సిద్ధమైనట్లు ప్రకటించింది. టాటా టెలి కమ్యూనికేషన్ భాగస్వామ్యంతో బిఎస్ఎన్ఎల్ ఇ-సిమ్ ప్రారంభించడానికి సిద్ధమైనట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 27వ తేదీ దేశం మొత్తం 4జి సేవలు ప్రకటించిన బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఇ-సిమ్ సర్వీస్ ని కూడా ఆఫర్ చేయబోతున్నట్లు కొత్త అప్డేట్ విడుదల చేసింది.

టాటా టెలీ కమ్యూనికేషన్ మరియు బిఎస్ఎన్ఎల్ సంయుక్తంగా తీసుకువచ్చే ఈ సిమ్ సర్వీస్ తో ఫిజికల్ సిమ్ కార్డ్ లేకపోయినా కూడా ఇ-సిమ్ సాయంతో గ్రామీణ ప్రాంతాల్లో సైతం బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వినియోగించుకునే అవకాశం ఉంటుంది. టాటా టెలీ కమ్యూనికేషన్ MOVE విభాగం బిఎస్ఎన్ఎల్ సహకారంతో ఈ కొత్త ఈ సిమ్ సర్వీస్ ని అందిస్తుంది. అంతేకాదు, ఈ కొత్త ఇ-సిమ్ ఎంచుకోవడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు, కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఇ-సిమ్ ని పొందవచ్చు.
Also Read: boAt Dolby Soundbar భారీ డిస్కౌంట్ తో కేవలం 4 వేల బడ్జెట్ ధరలో లభిస్తోంది.!
BSNL eSIM ఎక్కడ ఉంది?
బిఎస్ఎన్ఎల్ ముందుగా ఇ-సిమ్ సర్వీసును తమిళనాడు సర్కిల్ లో అందించింది. అంతేకాదు, త్వరలోనే ఈ సేవలు దేశం మొత్తం అందుబాటులోకి వస్తాయని కూడా పేర్కొంది. ఇది కాకుండా ఇంటి వద్దకే సిమ్ కార్డు అందించే డోర్ డెలివరీ సర్వీస్ ని కూడా బిఎస్ఎన్ఎల్ అందించింది. ఈ సర్వీస్ ద్వారా బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు తీసుకోవాలని చూస్తున్న వారికి ఇంటి వద్దకే సిమ్ కార్డ్ అందించే మహత్తరమైన పనికి పూనుకుంది.
బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న కొత్త అప్డేట్స్ మరియు సర్వీసెస్ చూస్తుంటే ఇప్పటికే మార్కెట్లో పాతుకుపోయిన ప్రైవేట్ టెలికాం కంపెనీలకు అసలైన పోటీదారుగా నిలవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బిఎస్ఎన్ఎల్ త్వరగా తీసుకు వస్తే ఇప్పుడు మనం అనుకుంటున్న మాట నిజమయ్యే అవకాశం ఉంటుంది. ముందు ముందు బిఎస్ఎన్ఎల్ ఎటువంటి మరిన్ని కొత్త సర్వీసెస్ తీసుకు వస్తుందో చూడాలి.