ఇక అందరి చూపు BSNL వైపు మళ్లనుందా..!

ఇక అందరి చూపు BSNL వైపు మళ్లనుందా..!
HIGHLIGHTS

ప్రైవేట్ యాజమాన్య టెలికం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచేశాయి

అందరి చూపు BSNL వైపు మళ్ళే అవకాశం ఉంటుందని ఊహిస్తున్నారు

ఎప్పటి వరకూ ఈ కొత్త రేట్లను కొనసాగిస్తాయో చూడాలి

ఒకదాని తరువాత ఒకటిగా ప్రైవేట్ యాజమాన్య టెలికం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచేశాయి. ఇదే కొనసాగితే ఇక అందరి చూపు BSNL వైపు మళ్ళే అవకాశం ఉంటుందని ఊహిస్తున్నారు. వాస్తవానికి, BSNL ఇప్పటికీ తక్కవ ధరకే తన ప్లాన్స్ ను అఫర్ చేస్తోంది. అయితే, ఈ పెరిగిన ధరలు ఎన్ని రోజులు నిలకడగా కొనసాగుతాయి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది.

ఎందుకంటే, ప్రస్తుతం  ఎయిర్టెల్, జియో మరియు వోడాఫోన్ ఐడియా(Vi) మూడు టెలికం సంస్థలు కూడా దాదాపుగా ఒకవిధమైన ధరలతో తమ రీఛార్జ్ ప్లాన్ లను అఫర్ చేస్తున్నాయి. వీటిలో జియో మాత్రం ధరలు పెరిగిన తరువాత కూడా కొంచెం తక్కవ ధరలో తన ప్రీపెయిడ్ ప్లాన్లను ఇవ్వడానికి చూస్తోంది. అయితే, BSNL మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న ధరలకే ప్లాన్ లను అఫర్ చేస్తోంది.

ఇక ఇప్పటికే, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా(Vi) కొత్త టారిఫ్ రేట్లను అమలుచేయగా, రిలయన్స్ జియో మాత్రమే రేపటి నుండి కొత్త ధరలను అమలులోకి తీసుకువస్తుంది. అయితే, కొత్తగా BSNL కూడా కొత్త విషయాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ బిఎస్ఎన్ఎల్ కొనసాగించిన లైఫ్ టైం ప్రీపెయిడ్ ప్లాన్ ను నేటితో నుండి నిలిపివేస్తోంది. అయితే, BSNL 4G లాంచింగ్ ప్రస్తుతం పరిస్థితులను చేజిక్కుంచునునే అవకాశాలు ఉన్నాయి.

కానీ, ఎయిర్టెల్, జియో మరియు వోడాఫోన్ ఐడియా(Vi) లు ఎప్పటి వరకూ ఈ కొత్త రేట్లను కొనసాగిస్తాయో చూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo