మొబైల్స్ బొనాంజా సేల్ నుండి Nokia 5.4 పైన భారీ డీల్స్

మొబైల్స్ బొనాంజా సేల్ నుండి Nokia 5.4 పైన భారీ డీల్స్
HIGHLIGHTS

Nokia 5.4 స్మార్ట్ ఫోన్ పైన భారీ డీల్స్ అందుకోండి

Flipkart చాలా మొబైల్స్ పైన బెస్ట్ డీల్స్ ప్రకటించింది

మొబైల్స్ బొనాంజా సేల్

HMD గ్లోబల్ సినీమ్యాటిక్ కెమెరాతో తీసుకొచ్చిన Nokia 5.4 స్మార్ట్ ఫోన్ పైన భారీ డీల్స్ అందుకోండి. Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం లో ఈరోజు నుండి మొబైల్స్ బొనాంజా సేల్ ప్రకటించింది. ఈ సేల్ నుండి చాలా మొబైల్స్ పైన బెస్ట్ డీల్స్ ప్రకటించింది. ఈ సేల్ నుండి నోకియా 5.4 స్మార్ట్ ఫోన్ ను తక్కువ ధరకే పొందవచ్చు. ఈ నోకియా స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ప్రొసెసర్ మరియు 48MP క్వాడ్ కెమెరాతో వచ్చింది. ఈ నోకియా స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 తో వచ్చిన కూడా వెంటనే ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అందుకుంటుందని సంస్థ తెలిపింది.

ఈ నోకియా 5.4  స్మార్ట్ ఫోనులో సరికొత్త సినిమా కెమెరా ఫీచర్ ను కూడా అందించింది. అందుకే, ఈ నోకియా 5.4 స్మార్ట్ ఫోన్ అఫర్  గురించి చూద్దాం.

నోకియా 5.4 ఫోన్ ధర

నోకియా 5.5 ఫోన్ యొక్క స్టార్టింగ్ వేరియంట్ 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ ను Rs.13,999 ధరతో విడుదల చేసింది. అయితే, ఈ సేల్ నుండి కేవలం రూ.12,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది మరియు సెలెక్టెడ్ డెబిట్/క్రెడిట్ కార్డ్ పేమెంట్ పైన 1,000 రూపాయల వరకూ అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇవికాక, No Cost EMI, మరియు మరిన్ని ఆఫర్లను కూడా అందించింది. Buy From Here       

NOKIA 5.4 స్పెషిఫికేషన్స్

NOKIA 5.4 స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.93 అంగుళాల HD+ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే19.5:9 ఎస్పెక్ట్ రేషియో మరియు పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 662 ఆక్టా కోర్ ప్రొసెసర్ ని కలిగి వుంది. ఇది Adreno 610 GPU తో వస్తుంది మరియు 4GB/6GB ర్యామ్ మరియు 64GB GB స్టోరేజ్ అప్షన్లతో వస్తుంది. స్టోరేజ్ ను మరింతగా పెంచుకోవడానికి SD కార్డు అప్షన్ కూడా ఇవ్వబడింది.

ఇక నోకియా 4.3 లోని కెమెరాల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా పరంగా గొప్పఫీచర్లనే కలిగి ఉన్నట్లు కంపెనీ చెబుతోంది. వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ వుంది. ఈ క్వాడ్ కెమెరా సెటప్ లో 48MP ప్రధాన కెమెరాకి జతగా 5MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్ వున్నాయి. ఈ ఫోన్ ముందుభాగంలో సెల్ఫీల కోసం సెల్ఫీ కెమెరాని పంచ్ హోల్ లో అందించింది. ఇందులో, 16MP సెన్సార్ ని ఉంచింది.

ఈ కెమెరా కోసం కొత్తగా 'Cinema Mode' ను అందించింది. దీనితో, 24fps అంటే సెకనుకు 24 ఫ్రేమ్స్ తో వీడియో లను చిత్రీకరించవచ్చు. అంటే, మనం సాధారణంగా చూసే సినిమా మాదిరిగా కనిపిస్తుందన్న మాట. Nokia 5.4 స్మార్ట్ ఫోన్ మొత్తానికి పవర్ అందించడాని 4,000 mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్టుతో అందించింది. ఆడియో విషయంలో కూడా సంస్థ యొక్క OZO Audio తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo