రియల్మీ 3 ప్రో VS రియల్మీ X : పూర్తి సరిపోలిక

రియల్మీ 3 ప్రో VS రియల్మీ X : పూర్తి సరిపోలిక
HIGHLIGHTS

ఈ రోజు మనం ఈ రెండు స్మార్ట్ ఫోన్ల మధ్య స్పెసిఫిషన్లను సరిపోల్చి తెలుసుకుందాం.

రియల్మీ సంస్థ, తన రియల్మ్ 3 ప్రో స్మార్ట్ ఫోన్ను ఇటీవలే భారతదేశంలో ప్రారంభించింది. ఇప్పుడు కొత్తగా రియల్మీ X స్మార్ట్ ఫోన్నుకూడా ఇండియాలో త్వరలో తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ రియల్మీ X స్మార్ట్ ఫోన్ రియల్మీ నుండి వచ్చినటువంటి మొట్టమొదటి పాప్-అప్ సెల్ఫీ కెమెరా మరియు ఒక 48 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరా కలిగిన ఫోనుగా ఉండనుంది. ఈ రోజు మనం ఈ రెండు స్మార్ట్ ఫోన్ల మధ్య స్పెసిఫిషన్లను సరిపోల్చి తెలుసుకుందాం.

Realme 3 Pro  Vs Realme X : ధర పోలిక

రియల్మీ 3 ప్రో యొక్క 6GB RAM మరియు 128GB స్టోరేజి వేరియంట్టును రూ 16.999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు మరియు 4GB RAM మరియు 64GB స్టోరేజి వేరియంట్ ధర రూ 13.999 రూపాయలుగా ఉంది. ఈ రియల్మీ X చైనాలో RMB 1,499 (~ రూ 15,400) ధరలో రియల్మీ X ను ప్రారంభించారు.

రియల్మీ 3 ప్రో vs రియల్మీ X:  డిస్ప్లే సరిపోలిక 

రియల్మీ 3 ప్రో ఒక 6.3 అంగుళాల డ్యూ డ్రాప్ నోచ్ డిస్ప్లే మరియు 2340X1080p తో FHD + రిజల్యూషనుతో వస్తుంది. ఇక రియల్మీ X  ఒక 6.5 అంగుళాలు X పూర్తి HD + శామ్సంగ్ AMOLED పూర్తి స్క్రీన్ డిస్ప్లేతోవస్తుంది మరియు ఇది 1080 x 2340 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందిస్తుంది. దీని స్క్రీన్-టు-బాడీ రేషియో  91.2 శాతం మరియు ఇది 5 వ జనరేషన్ గొరిల్లా గ్లాస్ ద్వారా ప్రొటెక్ట్ చేయబడింది.

Realme 3 ప్రో vs రియల్మీ X : ప్రాసెసర్ సరిపోలిక

రియల్మీ 3 ప్రో ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 మరియు GPU అడ్రినో 616 తో శక్తితో వస్తుంది, అలాగే ఇది X15 చిప్సెట్ మోడెమ్ తో మృదువైన కాల్స్ మరియు 4K HDR ప్లేబ్యాక్ మద్దతు అందిస్తుంది. ఇక గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి హైపర్ బూస్ట్ 2.0 కూడా చేర్చబడింది. మరొకవైపు రియల్మీ X స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే, ఇది 2.2 గిగాహెట్జ్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 చిప్సెట్ శక్తితో వస్తుంది.

రియల్లీ 3 ప్రో vs రియల్మీ X : కెమెరా సరిపోలిక

ఈ ఫోన్లలోని ఆప్టిక్స్ విషయానికి వస్తే, ఈ Realme 3 Pro  F / 1.7 ఎపర్చరు కలిగిన  ఒక 16 మెగాపిక్సెల్ సోనీ IMX519 సెన్సార్ మరియు దానికి జతగా   f / 2.4 ఎపర్చరు గల మరొక  5-మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరా కలిగిన  సెన్సారుతో అందించబడింది. ఈ పరికరంలో కెమెరా నైట్ స్కెప్ మోడ్ మద్దతు మరియు 960fps స్లో మోషన్ రికార్డింగ్ చేయగల శక్తితో వస్తుంది. ఈ కెమెరా 4K వీడియో రికార్డింగ్ సమర్ధత కలిగి మరియు వినియోగదారులు కొత్త వీడియో చేంజ్ ఫీచరుతో ఉంటుంది. అలాగే, ముందు ఒక ఒక 25-మెగాపిక్సెల్ AI కెమెరా సెల్ఫీల కోసం ముందు ఇవ్వబడింది. 

ఇక రియల్మీ X విషయానికి వస్తే, ఇది AI డ్యూయల్  వెనుక కెమెరా కలిగివుంది. ఇందులో ఒక కెమెరా  48-మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సారుతో వుంటుంది  మరియు మరొకటి 5 మెగాపిక్సెల్ సెన్సారుతో ఉంటుంది. అధనంగా, F / 2.0 ఎపర్చరు కలిగిన 16MP పాప్ అప్ సెల్ఫీ కెమేరాతో అలరిస్తుంది. 

Realme 3 ప్రో vs రియల్మీ X : బ్యాటరీ మరియు ఇతర ప్రత్యేకతలు

బ్యాటరీ గురించి మాట్లాడితే, అత్యున్నత వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 4045mah బ్యాటరీని ప్రో లో అందించారు. ఇది VOOC 3.0 ఫ్లాష్ ఛార్జ్  మద్దతు ఇస్తుంది మరియు దీని బాక్సుతోపాటుగా 20W ఛార్జర్ కూడా అందుతుంది. ఈ స్మార్ట్ఫోన్ Android OS పై పనిచేస్తుంది, ఇది ColorOS 6.0 పై పనిచేస్తుంది. అలాగే, Realme X Android 9 ColorOS 6.0 UI ఆధారంగా పనిచేస్తుంది మరియు ఇది కూడా VOOC 3.0 ఫ్లాష్ చార్జింగుకి మద్దతిస్తుంది కానీ ఇందులో 3765mAh బ్యాటరీని ఇవ్వడం జరిగింది. అధనంగా, ఇందులో  ఇన్ -డిస్ప్లే వేలిముద్ర సెన్సార్ అందించబడింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo