Boult Drift Max స్మార్ట్ వాచ్ ని పెద్ద HD స్క్రీన్ మరియు IP68 రేటింగ్ తో చవక ధరలో లాంచ్ చేసింది.!
Boult Drift Max స్మార్ట్ వాచ్ ని బోల్డ్ సరికొత్తగా ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది
పెద్ద HD స్క్రీన్ మరియు IP68 రేటింగ్ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో చవక ధరలో లాంచ్ చేసింది
బోల్ట్ ఈ కొత్త స్మార్ట్ వాచ్ ను రెండు వేరియంట్లలో అందించింది
Boult Drift Max స్మార్ట్ వాచ్ ని బోల్డ్ సరికొత్తగా ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ వాచ్ ని పెద్ద HD స్క్రీన్ మరియు IP68 రేటింగ్ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో చవక ధరలో లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలు ఆకట్టుకునే గొప్ప ఫీచర్స్ తో వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ధర మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.
Boult Drift Max: ధర
బోల్ట్ ఈ కొత్త స్మార్ట్ వాచ్ ను రెండు వేరియంట్లలో అందించింది. ఈ స్మార్ట్ వాచ్ యొక్క సిలికాన్ స్ట్రాప్ వేరియంట్ రూ. 1,099 మరియు స్టీల్ స్ట్రాప్స్ వేరియంట్ ను రూ. 1,199 ధరతో అందించింది. ఈ స్మార్ట్ వాచ్ ను అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు boult అధికారిక వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులో ఉంచింది. ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు నుంచి సేల్ అవుతోంది.
Boult Drift Max: ఫీచర్స్
ఈ బోల్ట్ కొత్త బడ్జెట్ స్మార్ట్ వాచ్ ఈ సెగ్మెంట్ లో పెద్ద స్క్రీన్ ను కలిగిన స్మార్ట్ వాచ్ పైగా నిలుస్తుంది.ఈ ఈ స్మార్ట్ వాచ్ హై డెఫినేషన్ (240×296) రిజల్యూషన్ కలిగిన 2.01 స్క్రీన్ ను 350 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ SpO2 ఆక్సిజన్ సాచ్యురేషన్, 24 x 7 హార్ట్ రేట్ మోనిటర్, బీపి మోనిటర్ మరియు ఫిమేల్ మెన్స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్ ఫీచర్స్ తో వస్తుంది.
ఈ బోల్ట్ స్మార్ట్ వాచ్ సులభమైన నావిగేషన్ కోసం పెద్ద రొటేటింగ్ క్రౌన్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ వాచ్ లో BT 5.2 కాలింగ్ సపోర్ట్ మరియు IP68 వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉన్నాయి. ఈ కొత్త స్మార్ట్ వాచ్ 120 కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ తో వస్తుంది మరియు యూజర్ కోసం 250 కి పైగా వాచ్ ఫేస్ లను కూడా ఆఫర్ చేస్తుంది.
Also Read: Infinix SMART 9 HD: మంచి ఆఫర్ తో ఈరోజు నుంచి మొదలైన బడ్జెట్ ఫోన్ సేల్.!
అంతేకాదు, ఈ బోల్ట్ డ్రిఫ్ట్ మాక్స్ స్మార్ట్ వాచ్ ఇంటెలిజెంట్ వాయిస్ అసిస్టెంట్, ఫైండ్ మై ఫోన్, వెథర్ రిపోర్ట్ మరియు రిమోట్ కెమెరా కంట్రోల్ వంటి అదనపు ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.