Realme Narzo Power: రియల్‌మీ నార్జో సిరీస్ నుంచి 10,001 mAh బ్యాటరీ ఫోన్ ను లాంచ్ చేస్తునట్లు రియల్‌మీ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ నార్జో సిరీస్ లో ఫస్ట్ 10,001 mAh బిగ్ బ్యాటరీ ఫోన్ గా లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ చూడటానికి రియల్‌మీ రీసెంట్ గా విడుదల చేసిన రియల్‌మీ పి4 పవర్ స్మార్ట్ ఫోన్ మాదిరిగానే కనిపిస్తోంది. మరి ఈ అప్ కమింగ్ రియల్‌మీ స్మార్ట్ ఫోన్ కలిగిన ఫీచర్స్ మరియు డిజైన్ వివరాలు ఏమిటో చూసేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Realme Narzo Power: ఎప్పుడు లాంచ్ అవుతుంది?
రియల్‌మీ నార్జో పవర్ స్మార్ట్ ఫోన్ ను మార్చి 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేస్తున్నట్లు రియల్‌మీ డేట్ ప్రకటించింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా నుంచి ప్రత్యేకమైన టీజర్ పీజీ అందించి టీజింగ్ చేస్తోంది.
రియల్‌మీ నార్జో పవర్ స్మార్ట్ ఫోన్ చూడటానికి దాదాపు రియల్‌మీ పి4 పవర్ మాదిరిగానే కనిపిస్తోంది. ఈ ఫోన్ 6.8 అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ మరియు 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, గొప్ప విజువల్స్ కోసం హైపర్ విజన్ ప్లస్ ఏఐ చిప్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను కూడా మీడియాటెక్ Dimensity 7400 Ultra 5G చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది.
ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50 MP ప్రైమరీ కెమెరా (Sony IMX882), 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ జతగా మరో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు జబర్దస్త్ AI కెమెరా ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను realme UI 7.0 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అవుతుంది.
ఈ ఫోన్ రెండు రోజులు బ్యాకప్ అందించే 10,001 mAh భారీ బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో ఉన్న భారీ బ్యాటరీని సైతం వేగంగా ఛార్జ్ చేసే 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను టైటాన్ బ్లూ మరియు టైటాన్ సిల్వర్ రెండు కలర్స్ లో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.