Bose Dolby సౌండ్ బార్ బిగ్ ప్రైస్ కట్ అండ్ సేల్ ఆఫర్స్ తో కేవలం 17 వేలకు సేల్ అవుతోంది.!
Bose Dolby సౌండ్ బార్ బిగ్ ప్రైస్ కట్ అండ్ సేల్ ఆఫర్స్ తో 17 వేలకు సేల్ అవుతోంది
ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 34,400 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది
ఇది బోస్ అందించిన టీవీ స్పీకర్ అండ్ సౌండ్ బార్
బోస్ అంటేనే ఆడియో ప్రొడక్ట్స్ కి పెట్టింది పేరు మరియు ప్రపంచ స్థాయిలో ఈ బ్రాండ్ కి ఎనలేని కీర్తి ఉంది. అలాంటి, బోస్ బ్రాండ్ నుండి వచ్చిన ఒక చిన్న బ్లూటూత్ స్పీకర్ కొనడానికే కనీసం 20 వేల రూపాయలైన ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే, ఈ రోజు Bose Dolby సౌండ్ బార్ బిగ్ ప్రైస్ కట్ అండ్ సేల్ ఆఫర్స్ తో కేవలం 17 వేలకు సేల్ అవుతోంది. బోస్ బ్రాండ్ స్పీకర్ లేదా సౌండ్ బార్ కొనాలని ధ్యేయంగా పెట్టుకున్నవారు ఈ డీల్ ని చూడొచ్చు.
SurveyBose Dolby సౌండ్ బార్ : ఆఫర్
బోస్ యొక్క ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 34,400 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ ప్రైస్ మెల్ల మెల్లగా తాగుతూ వచ్చింది. అయితే, గత రెండు మూడు రోజుల క్రితం కూడా రూ. 26,990 రూపాయల ధరలో సేల్ అయ్యింది. ఇప్పుడు 42% భారీ ప్రైస్ కట్ డిస్కౌంట్ తో కేవలం రూ. 19,900 ధరలో సేల్ అవుతోంది. ఈ ధరలో బోస్ అఫీషియల్ సైట్, అమెజాన్ మరియు ఫ్లిఫ్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది. అయితే, కంపెనీ సైట్ లో ఈ సౌండ్ బార్ అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు తో కనిపిస్తోంది.
ఈ సౌండ్ బార్ అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ సేల్ బ్యాంక్ ఆఫర్స్ తో మరింత తక్కువ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ని అమెజాన్ నుంచి SBI బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనే వారికి రూ. 1,500 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. అలాగే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ICICI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనే వారికి రూ. 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ మీకు కేవలం రూ. 17,990 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Haier Smart Tv పై అమెజాన్ సేల్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ మిస్ చేసుకోకండి.!
Bose Dolby సౌండ్ బార్ : ఫీచర్స్
ఇది బోస్ అందించిన టీవీ స్పీకర్ అండ్ సౌండ్ బార్. ఇది కేవలం రెండు ఫుల్ రేంజ్ స్పీకర్ మరియు ఒక ట్వీటర్ మాత్రమీ కలిగి ఉంటుంది. అయితే, ఈ సౌండ్ బార్ కలిగిన సెటప్ తో చాలా క్రిస్పీ అండ్ క్లియర్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 50W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది మరియు టీవీ టేబుల్ పైన సెట్ చేయడానికి డిజైన్ చేయబడింది.
ఇక సౌండ్ టెక్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ డీకోడ్ బిల్ట్ ఇన్ గా కలిగి ఉంది. అంటే, ఇది డాల్బీ డిజిటల్ సౌండ్ సపోర్ట్ చేస్తుంది మరియు బోస్ యొక్క ప్రత్యేకమైన ట్యూన్ తో చాలా రిచ్ అండ్ పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI Arc, USB, ఆప్టికల్, ఆనలాగ్ మరియు బ్లూటూత్ వంటి మల్టి కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటాయి. దీనితో బోస్ సబ్ ఉఫర్ ని కూడా కనెక్ట్ చేసే అవకాశం ఉంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
