Haier Smart Tv పై అమెజాన్ సేల్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ మిస్ చేసుకోకండి.!

HIGHLIGHTS

Haier Smart Tv పై అమెజాన్ సేల్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ మిస్ చేసుకోకండి

బ్రాండ్ న్యూ స్మార్ట్ టీవీ డీల్స్ కోసం చూస్తున్న యూజర్ల కోసం బెస్ట్ డీల్

ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ కలిగి ఉంటుంది

Haier Smart Tv పై అమెజాన్ సేల్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ మిస్ చేసుకోకండి.!

Haier Smart Tv పై అమెజాన్ సేల్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ మిస్ చేసుకోకండి. బ్రాండ్ న్యూ స్మార్ట్ టీవీ డీల్స్ కోసం చూస్తున్న యూజర్ల కోసం ఈరోజు ఈ బెస్ట్ డీల్ అందుబాటులో ఉంది. ఈ టీవీ మంచి విజువల్స్ అందించే స్క్రీన్, ప్రీమియం డిజైన్ మరియు మంచి సౌండ్ అందించే డాల్బీ సపోర్ట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఈ రోజు అమెజాన్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి చాలా రీజనబుల్ ధరలో లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Haier Smart Tv : ఆఫర్స్

హైయర్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ 43H5E గూగుల్ టీవీని అమెజాన్ ఈరోజు ఈ బెస్ట్ ప్రైస్ లో సేల్ చేస్తోంది. ఈ టీవీపై 23% డిస్కౌంట్ అందించి రూ. 29,990 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తున్న అమెజాన్, ఈ టీవీ పైన రూ. 700 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 2,000 భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. SBI బ్యాంకు క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ తో తీసుకునే వారికి ఈ బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది.

Haier Smart Tv features

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు అందించిన అన్ని ఆఫర్స్ తో టీవీని కేవలం రూ. 27,290 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని అమెజాన్ సేల్ నుంచి ఆఫర్ ధరలో కొనడానికి Buy From Here పైన క్లిక్ చేయండి

Also Read: Sony 5.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ పండగ ఆఫర్ అనౌన్స్ .. సేల్ ప్రైస్ ఎంతంటే.!

Haier Smart Tv : ఫీచర్స్

ఈ హైయర్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ లేటెస్ట్ డిజైన్‌ తో పాటు మంచి పిక్చర్ క్వాలిటీ, స్మార్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు కోరుకునే వారికి అనువైన స్మార్ట్ టీవీ గా వచ్చింది. ఇందులో, 43 అంగుళాల ఎల్ఈడి స్క్రీన్ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. అలాగే, వీడియో అప్‌ స్కేలింగ్ సపోర్ట్, HDR 10, మరియు HLG వంటి ఫీచర్స్ తో కంటెంట్‌ను చాలా క్లియర్ గా అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ డిజిటల్, టోటల్ సోనిక్ మరియు సరౌండ్ సౌండ్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఇందులో 4 HDMI పోర్టులు, 2 USB పోర్టులు, Wi-Fi, బిల్ట్ ఇన్, బ్లూటూత్, ఈథర్నెట్ LAN కనెక్షన్, హెడ్‌ ఫోన్ అవుట్‌ పుట్, ఆప్టికల్ డిజిటల్ ఆడియో అవుట్‌ పుట్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile