గత వారం విడుదలైన Noise 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ పండగ ఆఫర్స్ తో చవక ధరలో సేల్ అవుతోంది.!
Noise 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ పండగ ఆఫర్స్ తో చవక ధరలో సేల్ అవుతోంది
గత వారం గొప్ప స్పీకర్ సెటప్ తో ఈ కొత్త సౌండ్ బార్ ని లాంచ్ చేసింది
ఈ నోయిస్ సౌండ్ బార్ చూడగానే ఆకట్టుకునే ప్రీమియం డిజైన్ తో వస్తుంది
గత వారం విడుదలైన Noise 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ పండగ ఆఫర్స్ తో చవక ధరలో సేల్ అవుతోంది. పండుగ సేల్ సందర్భంగా నోయిస్ గత వారం గొప్ప స్పీకర్ సెటప్ తో ఈ కొత్త సౌండ్ బార్ ని లాంచ్ చేసింది. ఇది ప్రీమియం డిజైన్, డ్యూయల్ కలర్ ఆప్షన్ మరియు ట్రూ డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.
SurveyNoise 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్
నోయిస్ గత వారం మార్కెట్ లో Home stage 5.2.4 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ని విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ ను రూ. 24,999 ధరలో లాంచ్ చేసింది. అయితే, ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ పండుగ సేల్ సందర్భంగా ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 భారీ పండుగ డిస్కౌంట్ అందించాయి. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 22,999 ఆఫర్ ధరలో లభిస్తుంది.

ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ రెండు ప్లాట్ ఫామ్స్ కూడా భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించాయి. ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 రూపాయల ICICI అండ్ Axis బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. అమెజాన్ దీనిపై రూ. 1,500 రూపాయల SBI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ని కేవలం రూ. 20,999 రూపాయల పండుగ సేల్ ఆఫర్ ధరలో అందుకోవచ్చు. Buy From Here
Also Read: Bose Dolby సౌండ్ బార్ బిగ్ ప్రైస్ కట్ అండ్ సేల్ ఆఫర్స్ తో కేవలం 17 వేలకు సేల్ అవుతోంది.!
Noise 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ నోయిస్ సౌండ్ బార్ చూడగానే ఆకట్టుకునే ప్రీమియం డిజైన్ తో వస్తుంది. ప్రస్తుతం, చాలా కంపెనీలు కేవలం సింగల్ కలర్ లో వాటి సౌండ్ బార్ లను అందిస్తుంటే, నోయిస్ మాత్రం ఈ సౌండ్ బార్ ని బ్లాక్ మరియు సిల్వర్ రెండు కలర్స్ లో లాంచ్ చేసింది. ఈ నోయిస్ సౌండ్ బార్ 5.2.4 సెటప్ కలిగి ఉంటుంది. ఈ సెటప్ లో ముందు మూడు స్పీకర్, పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్ తో వచ్చే ప్రత్యేకమైన కలిగిన సౌండ్ బార్ ఉంటుంది. దీనితో డౌన్ ఫైరింగ్ ఉఫర్ లు కలిగిన డ్యూయల్ సబ్ ఉఫర్ మరియు ఫ్రంట్ మరియు పైన అప్ ఫైరింగ్ స్పీకర్ ఉన్న డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ లు కూడా కలిగి ఉంటుంది.
ఈ కంప్లీట్ సెటప్ తో ఈ నోయిస్ సౌండ్ బార్ 700W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ మరియు సెటప్ తో పాటు ఈ సౌండ్ బార్ లో డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా అందించింది. ఈ పూర్తి వివరాలతో ఈ సౌండ్ బార్ థియేటర్ స్థాయి సరౌండ్ అండ్ క్లియర్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో, HDMI eArc, AUX, USB, ఆప్టికల్ ఇన్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా నోయిస్ అందించింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
