Samsung Galaxy S26 Ultra: ప్రైవసీ డిస్ప్లే మరియు పవర్ ఫుల్ కెమెరాతో లాంచ్ అయ్యింది.!
Samsung Galaxy S26 Ultra స్మార్ట్ ఫోన్ ను ప్రపంచానికి పరిచయం చేసింది
ప్రైవసీ డిస్ప్లే మరియు పవర్ ఫుల్ కెమెరాతో లాంచ్ చేసింది
ఈ ఫోన్ ను సైడ్ నుంచి చూసే వారికి స్క్రీన్ కనపడకుండా ఉంటుంది
Samsung Galaxy S26 Ultra: శాంసంగ్ ఈరోజు ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ గెలాక్సీ ఎస్ 26 నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సిరీస్ లో కూడా అల్ట్రా ప్రీమియం ఫోన్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా ఫోన్ ను ప్రైవసీ డిస్ప్లే మరియు పవర్ ఫుల్ కెమెరాతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను లేటెస్ట్ పవర్ ఫుల్ Snapdragon చిప్ సెట్ మరియు అల్ట్రా స్లీక్ డిజైన్ వంటి మరిన్ని ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసింది.
SurveySamsung Galaxy S26 Ultra: ఫీచర్స్
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా స్మార్ట్ ఫోన్ QHD+ రిజల్యూషన్ కలిగిన 6.9 అంగుళాల Dynamic AMOLED 2X డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇందులో M14 ప్యానల్ తో ప్రైవసీ డిస్ప్లే గా ఉంటుంది. అంటే, ఈ ఫోన్ ను సైడ్ నుంచి చూసే వారికి స్క్రీన్ కనపడకుండా ఉంటుంది. 1Hz-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ మరియు 2600 నిట్స్ వరకు పిక్ బ్రైట్‌నెస్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ Snapdragon 8 Elite Gen 5 తో లాంచ్ చేసింది. ఇది (3nm) చిప్ సెట్ మరియు అత్యంత శక్తివంతమైన ప్రీమియం ప్రోసెసర్ గా ఇప్పటికే ప్రాచుర్యం పొందింది. అంతేకాదు, ఈ పవర్ ఫుల్ ప్రోసెసర్ తో జతగా 12GB / 16GB ఫాస్ట్ ర్యామ్ మరియు 256GB / 512GB / 1TB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ One UI 8.5 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది.
కెమెరా పరంగా, గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సిస్టం ఉంటుంది. ఇందులో 50MP అల్ట్రా వైడ్ సెన్సార్, 200MP వైడ్ కెమెరా (2x ఆప్టికల్ జూమ్), 50MP టెలిఫోటో (5x ఆప్టికల్ జూమ్) మరియు 10MP టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జామ్) కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ కెమెరా సెటప్ తో30FPS తో 8K వీడియో, 120 / 60FPS తో 4K వీడియోలు షూట్ చేయవచ్చు. అలాగే, ఈ ఫోన్ లో 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ PDAF, Auto HDR, Panorama మరియు Laser AF వంటి అదనపు ఫోటోగ్రఫీ ఫీచర్స్ మరియు జబర్దస్త్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఇతర ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ లో 5000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 60W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 25W వైర్లెస్ ఛార్జింగ్ (Qi2 Support) మరియు వైర్లెస్ పవర్ షేర్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ప్రీమియం ఫోన్ IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో ఉంటుంది. కాల్ స్క్రీనింగ్, ప్రైవసీ అలర్ట్, ప్రైవేట్ ఆల్బమ్, పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ వంటి మరిన్ని సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఈ ఫోన్ కలిగి ఉంటుంది.
Also Read: Samsung Galaxy S26 Plus: ఫ్లాగ్ షిప్ ఫీచర్స్ తో ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ గా వచ్చింది.!
Samsung Galaxy S26 Ultra: ప్రైస్
శాంసంగ్ ఈ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మూడు వేరియంట్ ధర వివరాలు క్రింద చూడవచ్చు.
శాంసంగ్ లేటెస్ట్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా (12GB + 256GB) ప్రైస్ : రూ. 1,39,999
శాంసంగ్ లేటెస్ట్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా (12GB + 512GB) ప్రైస్ : రూ. 1,59,999
శాంసంగ్ లేటెస్ట్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా (16GB + 1TB) ప్రైస్ : రూ. 1,89,999
ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్ లను ఈరోజు నుంచి ప్రారంభించింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile