ViVO V70 భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది.!

HIGHLIGHTS

ViVO V70 స్మార్ట్ ఫోన్ గత వారం ఇండియాలో లాంచ్ అయ్యింది

బేసిక్ మోడల్ ఫోన్ గా వచ్చిన ఈ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది

లాంచ్ ఆఫర్స్ అందుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది

ViVO V70 భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది.!

ViVO V70 స్మార్ట్ ఫోన్ గత వారం ఇండియాలో లాంచ్ అయ్యింది. వివో వి70 సిరీస్ లో బేసిక్ మోడల్ ఫోన్ గా వచ్చిన ఈ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. వివో ఈ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్స్ అందించింది. ఈ ఆఫర్స్ అందుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. అందుకే, వివో వి 70 స్మార్ట్ ఫోన్ ఆఫర్స్, ఫీచర్స్ మరియు ఈ ఫోన్ గురించి మీరు తెలుసుకోవలసిన పూర్తి వివరాలు ఇక్కడ అందించాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ViVO V70 : ప్రైస్

వివో వి70 స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ బేసిక్ (8GB + 128GB) వేరియంట్ రూ. 45,999 ధరతో మరియు హై ఎండ్ (8GB + 256GB) వేరియంట్ రూ. 49,999 ధరతో లాంచ్ అయ్యాయి. పాషన్ రెడ్ మరియు లెమన్ ఎల్లో అనే రెండు రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు వివో అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ ఫోన్ ఆన్లైన్ సేల్ కి అందుబాటులో ఉంది. అలాగే, ఈ ఫోన్ అన్ని ప్రధాన రిటైల్ స్టోర్ నుంచి కూడా లభిస్తుంది.

ఆఫర్స్ :

ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ అండ్ భారీ అదనపు ఎక్స్ చేంజ్ వంటి మరిన్ని ఆఫర్లు అందించింది. ఈ ఫోన్ పై రూ. 5,000 రూపాయల వరకు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అలాగే, ఈ ఫోన్ పై రూ. 6,200 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. ఇది కాకుండా 1 సంవత్సరం అదనపు వారంటీ, ఉచిత TWS బడ్స్ మరియు స్టూడెంట్ కోసం రూ. 1,000 రూపాయల ప్రత్యేకమైన డిస్కౌంట్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ వివో ఫోన్ చాలా తక్కువ ధరలో లభిస్తుంది.

Also Read: Realme Narzo Power: నార్జో సిరీస్ నుంచి 10,001mAh బ్యాటరీ వస్తోంది.!

ViVO V70 : ఫీచర్స్

వివో వి70 ఫోన్ 6.59 ఇంచ్ AMOLED స్క్రీన్ ను 3D అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్, వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7 Gen 4 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 8 జీబీ LPDDR5X ర్యామ్ అండ్ 256 జీబీ (UFS 4.1) స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ IP68 అండ్ IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

ఈ వివో ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరాతో వచ్చింది. ఇందులో 50MP (ZEISS) మెయిన్ కెమెరా, 8MP (ZEISS) అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 50MP (ZEISS) నైట్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. అలాగే, 50MP సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ ఫోన్ రియర్ కెమెరా 3x ఆప్టికల్ జూమ్ మరియు 60FPS 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ వాటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 6500 mah బ్లూ వోల్ట్ బిగ్ బ్యాటరీ తో కలిగి ఉంటుంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జ్ తో పాటు బైపాస్ ఛార్జ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo