Samsung Galaxy Buds 4 Series: బెస్ట్ ఫిట్ అండ్ Hi-Fi సౌండ్ తో రిలీజ్ అయ్యింది.!

HIGHLIGHTS

శాంసంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ మరియు కొత్త బడ్స్ ను కూడా విడుదల చేసింది

మూడు స్మార్ట్ ఫోన్లు మరియు గెలాక్సీ బడ్స్ 4 సిరీస్ నుంచి రెండు బడ్స్ ను ఈరోజు విడుదల చేసింది

ఈ సిరీస్ నుంచి గెలాక్సీ బడ్స్ 4 మరియు గెలాక్సీ బడ్స్ 4ప్రో రెండు ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది

Samsung Galaxy Buds 4 Series: బెస్ట్ ఫిట్ అండ్ Hi-Fi సౌండ్ తో రిలీజ్ అయ్యింది.!

Samsung Galaxy Buds 4 Series: శాంసంగ్ ఈరోజు నిర్వహించిన అతిపెద్ద ఈవెంట్ నుంచి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ మరియు కొత్త బడ్స్ ను కూడా విడుదల చేసింది. గెలాక్సీ ఎస్ 26 సిరీస్ నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు మరియు గెలాక్సీ బడ్స్ 4 సిరీస్ నుంచి రెండు బడ్స్ ను ఈరోజు విడుదల చేసింది. ఈ లేటెస్ట్ బడ్స్ ను కొత్త ట్రాన్స్‌పరెంట్ కేస్ డిజైన్ మరియు హారిజాంటల్ లే అవుట్ వంటి న్యూ డిజైన్ తో పాటు Hi-Fi సౌండ్ తో అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy Buds 4 Series:

ఈ సిరీస్ నుంచి గెలాక్సీ బడ్స్ 4 మరియు గెలాక్సీ బడ్స్ 4ప్రో రెండు ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది. ఇందులో స్టాండర్డ్ బడ్స్ అయిన గెలాక్సీ బడ్స్ 4 ను సిలికాన్ టిప్స్ లేకుండా సెమీ ఓపెన్ ఇన్ ఇయర్ స్టైల్ తో అందించింది. అయితే, బడ్స్ 4 ప్రో మోడల్ ను మాత్రం ఇన్ ఇయర్ సిలికాన్ టిప్స్ తో ఫిట్ డిజైన్ లో అందించింది.

Samsung Galaxy Buds 4 Series

Samsung Galaxy Buds 4 Series: ప్రైస్

శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 4 ను ఇండియాలో రూ. 16,999 ప్రైస్ ట్యాగ్ తో మరియు గెలాక్సీ బడ్స్ 4 ప్రో ఇయర్ బడ్స్ ను రూ. 22,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ ఈరోజు నుంచి ప్రీ బుకింగ్స్ కి అందుబాటులోకి వచ్చాయి.

Also Read: Samsung Galaxy S26 Ultra: ప్రైవసీ డిస్ప్లే మరియు పవర్ ఫుల్ కెమెరాతో లాంచ్ అయ్యింది.!

శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 4 : ఫీచర్స్

ఈ బడ్స్ ను సరికొత్త డిజైన్ తో అందించింది మరియు గత సిరీస్ బడ్స్ తో పోలిస్తే మరింత ఆకర్షణీయమైన రూపంలో ఉన్నాయి. ఈ బడ్స్ లో అధునాతన సౌండ్ ప్రొఫైల్ జత కలిసిన డైనమిక్ వైడ్ రేంజ్ స్పీకర్లు ఉంటాయి. ఈ బడ్స్ రిచ్ బాస్ అండ్ రిచ్ సౌండ్ తో అల్ట్రా హై క్వాలిటీ ఆడియో ఆఫర్ చేస్తుంది. ఈ బడ్స్ హెడ్ ట్రాకింగ్ తో 360° ఆడియో సపోర్ట్ మరియు యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో గెలాక్సీ AI ఫీచర్, LE ఆడియో మరియు 6 మైక్ తో సూపర్ క్లియర్ కాల్ వాటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ బడ్స్ బ్లూటూత్ 6.1 తో సూపర్ కనెక్టివిటీ కూడా కలిగి ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 4 ప్రో : ఫీచర్స్

ఈ శాంసంగ్ కొత్త బడ్స్ బెస్ట్ ఫిట్ అండ్ సూపర్ కంఫర్ట్ డిజైన్ తో వచ్చాయి. ఈ బడ్స్ లో గొప్ప సౌండ్ అందించే 2 Way స్పీకర్ సెటప్ మరియు డ్యూయల్ ఆమ్ప్లిఫైర్ ఫీచర్ ను కూడా అందించింది. ఈ బడ్స్ శాంసంగ్ సీమ్ లెస్ కోడెక్ (SSC) ఫీచర్ తో 24-bit / 96 kHz audio సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది సూపర్ క్లియర్ అండ్ Hi-Fi సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది మరింత మెరుగైన ANC తో లీనమయ్యే క్లియర్ సౌండ్ ఆఫర్ చేస్తుంది.

ఇది Intelligent ANC 2.0 సపోర్ట్ తో ఈ బడ్స్ పర్యావరణ శబ్దం అనుగుణంగా ఆటోమేటిక్ గా అనుసరిస్తుంది. ఇది LE Audio / LC3 / AAC / SBC సపోర్ట్, ఆటో స్విచ్ మరియు ఆరా క్యాస్ట్ సపోర్ట్ కూడా కలిగి ఉంది. Bixby / Google కి వాయిస్ సపోర్ట్, హెడ్ ట్రాకింగ్ తో 360° ఆడియో సపోర్ట్ మరియు లైవ్ ట్రాన్స్లేట్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఉన్న 6 మైక్ సెటప్ మరియు సూపర్ క్లియర్ కాల్ ఫీచర్ తో గొప్ప కాలింగ్ కూస ఆఫర్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo