Infinix SMART 9 HD: మంచి ఆఫర్ తో ఈరోజు నుంచి మొదలైన బడ్జెట్ ఫోన్ సేల్.!
Infinix SMART 9 HD ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది
ఈ ఫోన్ 7 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చింది
ఈ ఇన్ఫినిక్స్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర, ఆఫర్లు మరియు ఫీచర్స్ తెలుసుకోండి
Infinix SMART 9 HD: ఇన్ఫినిక్స్ గత వారం ఇండియాలో విడుదల చేసిన బడ్జెట్ 4G స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 7 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఆకట్టుకునే ఫీచర్స్ మరియు డిజైన్ తో వచ్చింది. బడ్జెట్ సెగ్మెంట్ యూజర్ టార్గెట్ గా తీసుకు వచ్చిన ఈ ఇన్ఫినిక్స్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర, ఆఫర్లు మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
Infinix SMART 9 HD: ధర
ఇన్ఫినిక్స్ స్మార్ట్ HD స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 6,699 ప్రైస్ ట్యాగ్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ ఫోన్ ను Flipkart ద్వారా సేల్ కి అందుబాటులోకి తీసుకు వచ్చిన ఇన్ఫినిక్స్ ఈ ఫోన్ తో రూ. 500 డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ ను Credit మరియు Debit కార్డ్ తో కొనుగోలు చెస్ వారికి ఈ అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 6,199 ఆఫర్ ధరకే అందుకోవచ్చు.
Also Read: LG జబర్దస్త్ Dolby Atmos Soundbar పై ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ ఆఫర్ అందుకోండి.!
Infinix SMART 9 HD: ఫీచర్స్
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ IPS స్క్రీన్ ను పంచ్ హోల్ డిజైన్ మరియు HD+ రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఇన్ఫినిక్స్ బడ్జెట్ ఫోన్ Mediatek Helio G50 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 3GB ఫిజికల్ ర్యామ్ మరియు 3GB ఎక్స్టెండెడ్ ర్యామ్ టి పాటు 64GB ఇంటెర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక 13MP + AI Lens డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో జూమ్ LED ఫ్లాష్ లైట్, డ్యూయల్ స్పీకర్లు, DTS సౌండ్ సపోర్ట్, గ్లాస్ బ్యాక్ మరియు పటిష్టమైన డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు టైప్ C పోర్ట్ సపోర్ట్ తో ఇన్ఫినిక్స్ అందించింది.