Oppo K14 5G: ఒప్పో పవర్ హౌస్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది.!

HIGHLIGHTS

ఒప్పో ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ కోసం డేట్ అనౌన్స్ చేసింది

Oppo K14 5G భారీ బ్యాటరీ మరియు కొత్త డిజైన్ తో అనౌన్స్

స్మార్ట్ ఫోన్ కోసం అందించిన కొత్త టీజర్ నుంచి ఈ ఫోన్ వివరాలు వెల్లడించింది

Oppo K14 5G: ఒప్పో పవర్ హౌస్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది.!

Oppo K14 5G: అతిపెద్ద చైనీస్ మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ కోసం డేట్ అనౌన్స్ చేసింది. ఒప్పో కె13 సిరీస్ నుంచి బిల్ట్ ఫ్యాన్ తో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసి చరిత్ర సృష్టించిన ఒప్పో, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ సిరీస్ నుంచి భారీ బ్యాటరీ మరియు కొత్త డిజైన్ తో ఫోన్లు లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం అందించిన కొత్త టీజర్ నుంచి ఈ ఫోన్ వివరాలు వెల్లడించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oppo K14 5G : లాంచ్ డేట్?

ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఒప్పో కె14 5జి ఫోన్ ను మార్చి 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేస్తున్నట్లు డేట్ అండ్ టైం అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ యూనిక్ గా లాంచ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి ప్రత్యేకంగా సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది. అందుకే ఏ, ఫ్లిప్ కోర్ట్ కూడా ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజీ అందించింది.

Also Read: Apple iPhone 17e ను లాంచ్ చేసిన ఆపిల్.. ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

Oppo K14 5G : ఫీచర్స్

ఒప్పో కె4 స్మార్ట్ ఫోన్ ను పవర్ హౌస్ ఫోన్ గా లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో చెబుతోంది. ఇందుకు కారణం కూడా ఉంది. అదేమిటంటే, ఈ ఫోన్ ను 7000 mAh బిగ్ బ్యాటరీతో బిగ్ బ్యాటరీ లాంచ్ చేస్తోంది. అందుకే, ఈ ఫోన్ ను పవర్ హౌస్ అని పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఈ ఫోన్ కలిగిన పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా ఈ ఫోన్ ను లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ ను కూడా లేటెస్ట్ కలర్ OS తో లాంచ్ చేస్తుంది. ఈ కీలక వివరాలు కంపెనీ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

Oppo K14 5G

ఇక ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉన్నట్లు మనకు క్లియర్ అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్స్ తో లాంచ్ అవుతున్నట్లు కూడా క్లియర్ అవుతుంది. ఈ ఫోన్ పెద్ద బ్యాటరీ కలిగి ఉన్నా కూడా చాలా స్లీక్ గా ఉన్నట్లు మనం చూడొచ్చు. ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ కూడా త్వరలో ఒప్పో వెల్లడిస్తుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo