ఆపిల్ తన ఐఫోన్ 17 సిరీస్ నుంచి బేసిక్ అండ్ బడ్జెట్ వేరియంట్ Apple iPhone 17e ను ఈరోజు విడుదల చేసింది. ఆపిల్ 17 సిరీస్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ గా ఈ ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేసింది. ఆపిల్ ఈ ఫోన్ ను కూడా స్టన్నింగ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ ఆపిల్ బడ్జెట్ వేరియంట్ ధర మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Apple iPhone 17e: ప్రైస్
ఆపిల్ ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ (256GB) వేరియంట్ ను రూ. 64,900 ధరతో అందించింది. ఈ ఫోన్ హాయ్ ఎండ్ (512GB) మోడల్ ను రూ. 84,900 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో అందించింది. ఈ ఫోన్ ను బ్లాక్, వైట్ మరియు పింక్ మూడు రంగుల్లో లాంచ్ చేసింది. అంటే, ఈ ఫోన్ ను కూడా iPhone SE మరియు iPhone 16e లాంటి బడ్జెట్ సెగ్మెంట్లో అందించింది.
మార్చి 4వ తేదీన రాత్రి 7 గంటల 45 నిమిషాల (7:45 PM IST) నుంచి ఈ ఫోన్ ఫ్రీ ఆర్డర్లను ఆపిల్ స్టార్ట్ చేస్తుంది. అయితే, ఈ ఫోన్ సేల్ మాత్రం మార్చి 11వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.
Apple iPhone 17e: ఫీచర్స్
ఈ ఫోన్ ను 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ మరింత కుదించిన డైనమిక్ ఐల్యాండ్ తో కొత్త డైనమిక్ UI అనుభవం అందిస్తుంది మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను కూడా 17 సిరీస్ అందించిన అదే A19 చిప్ (3 nm) తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ కూడా C1X మోడెమ్ తో వేగవంతమైన 5G అండ్ కనెక్టివిటీ ఆఫర్ చేస్తుంది. ఇందులో 256 జీబీ మరియు 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ఉంటాయి.
ఐఫోన్ 17 స్మార్ట్ ఫోన్ 48 MP Fusion రియర్ కెమెరా మరియు ముందు 12MP ట్రూ డెప్త్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ కెమెరా డిఫాల్ట్ గా 24MP కెమెరా ఫోటోలు చిత్రీకరిస్తుంది మరియు 48MP తో హై రిజల్యూషన్ ఫోటోలు అందిస్తుంది. ఈ ఫోన్ 2x ఆప్టికల్ జూమ్ మరియు 2 ఇన్ 1 కెమెరా ఎక్స్ పీరియన్స్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ స్మార్ట్ HDR మరియు 4K Dolby Vision వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో పాటు అడ్వాన్స్డ్ పోర్ట్రైట్ ఫీచర్లతో వస్తుంది.
ఇక డిజైన్ అండ్ బిల్ట్ విషయానికి వస్తే, ఈ ఫోన్ అల్యూమినియం ఏరో స్పేషియల్ బాడీతో IP68 రేటింగ్ కలిగి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది. ఇది మాట్టే ఫినిష్ రంగులు తో ఆధునిక లుక్ తో ఉంటుంది. ఈ ఫోన్ కూడా టైప్ C ఛార్జ్ పోర్ట్ తో వస్తుంది. అయితే, ఈ ఫోన్ MagSafe వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చిన e సిరీస్ మొదటి ఫోన్ గా నిలుస్తుంది మరియు Qi2 సపోర్ట్ తో కూడా వస్తుంది. అంతేకాదు, రివైజ్డ్ Ceramic Shield 2 స్క్రీన్ రక్షణ మరియు స్క్రాచ్ రోబస్ట్ కోటింగ్ తో ఉంటుంది.