Amazfit Bip 6: బడ్జెట్ ధరలో ఖచ్చితమైన హెల్త్ మోనిటరింగ్ మరియు GPS తో లాంచ్ అయ్యింది.!
Amazfit Bip 6 స్మార్ట్ వాచ్ ట్టకేలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది
అమాజ్ ఫిట్ బిప్ 6 బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్స్ తో మార్కెట్ లో అడుగుపెట్టింది
ఖచ్చితమైన హెల్త్ మోనిటరింగ్ మరియు GPS నేవిగేషన్ తో లాంచ్ అయ్యింది
Amazfit Bip 6: అమాజ్ ఫిట్ బిప్ 6 స్మార్ట్ వాచ్ ఇండియా లాంచ్ గురించి చాలా కాలంగా టీజింగ్ చేస్తూ వచ్చిన కంపెనీ ఈరోజు ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ బడ్జెట్ ధరలో ఖచ్చితమైన హెల్త్ మోనిటరింగ్ మరియు GPS నేవిగేషన్ తో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ వాచ్ గురించి సింపుల్ గా చెప్పాలంటే బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్స్ తో మార్కెట్ లో అడుగుపెట్టింది.
Amazfit Bip 6: ఫీచర్స్
అమాజ్ ఫిట్ బిప్ 6 6 స్మార్ట్ వాచ్ చూడగానే ఆకర్షించే లుక్స్ తో మరియు నాలుగు అందమైన కలర్ ఆప్షన్ తో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, చార్కోల్, రెడ్ మరియు స్టోన్ నాలుగు కలర్స్ లో లభిస్తుంది. ఈ వాచ్ 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 1.97 ఇంచ్ బిగ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు గొప్ప రిజల్యూషన్ తో వైబ్రాంట్ కలర్స్ అందిస్తుంది.
యూజర్ కు రియల్ టైమ్ హెల్త్ మోనిటరింగ్ ఆఫర్ చేయడానికి వీలుగా ఇందులో 24/7 బయో ట్రాకర్ టెక్నాలజీ అందించింది. ఇది రియల్ టైమ్ హార్ట్ రేట్, స్లీప్ క్వాలిటీ, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ మరియు స్ట్రెస్ మోనిటరింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ 140 కంటే అధిక వర్క్ అవుట్ మోడ్స్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా స్ట్రెంగ్త్ ట్రైనింగ్, జెప్ కోచ్ మరియు ఆటో డిటెక్ట్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ అమేజ్ ఫిట్ స్మార్ట్ వాచ్ 512 MB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 64MB ర్యామ్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ 14 రోజులు నిలిచి ఉండే లాంగ్ లాస్టింగ్ లిథియం పాలిమర్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అమాజ్ ఫిట్ బిప్ 6 6 స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కనెక్టివిటీ తో AI కాలింగ్ మరియు టెక్స్ట్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ 50m (5 ATM) వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తో వస్తుంది.
ఈ అమేజ్ స్మార్ట్ వాచ్ ఇన్ బిల్ట్ GPS Tracking మరియు నావిగేషన్ తో వస్తుంది. అంతేకాదు, మప్స్ ను డౌ లోడ్ చేసుకొని నావిగేషన్ చేసే అవకాశం ఉంటుంది మరియు టర్న్ బై టర్న్ డైరెక్షన్ కూడా అందిస్తుంది.
Also Read: Realme Buds Air 7 Pro: ప్రీమియం ఇయర్ బడ్స్ లాంచ్ చేస్తున్న రియల్ మీ.!
Amazfit Bip 6: ప్రైస్
అమాజ్ ఫిట్ బిప్ 6 6 స్మార్ట్ వాచ్ ను రూ. 7,999 ధరతో లాంచ్ చేసింది మరియు ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ మరియు amazfit అధికారిక సైట్ నుంచి లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ను HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 500 డిస్కౌంట్ ఆఫర్ అందించింది.