Realme Buds Air 7 Pro: ప్రీమియం ఇయర్ బడ్స్ లాంచ్ చేస్తున్న రియల్ మీ.!

HIGHLIGHTS

Realme Buds Air 7 Pro బడ్స్ లాంచ్ ప్రకటించిన రియల్ మీ

రియల్ మీ GT 7 సిరీస్ స్మార్ట్ ఫోన్ లతో పాటు లాంచ్ చేయవచ్చని అంచనా

11mm ఉఫర్ మరియు 6mm ట్వీటర్ లను కలిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు

Realme Buds Air 7 Pro: ప్రీమియం ఇయర్ బడ్స్ లాంచ్ చేస్తున్న రియల్ మీ.!

Realme Buds Air 7 Pro: రియల్ మీ అప్ కమింగ్ ఈవెంట్ నుంచి కొత్త బడ్స్ లాంచ్ చేసే అవకాశం వుంది. ఎందుకంటే, రియల్ మీ బడ్స్ ఎయిర్ 7 ప్రో బడ్స్ ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు రియల్ ని అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ బడ్స్ ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. అయితే, ఈ బడ్స్ ను రియల్ మీ GT 7 సిరీస్ స్మార్ట్ ఫోన్ లతో పాటు లాంచ్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

Realme Buds Air 7 Pro: ఫీచర్స్ (అంచనా)

వాస్తవానికి, రియల్ మీ GT సిరీస్ ఫోన్ లతో పాటు ఈ బడ్స్ ను కూడా చైనా మార్కెట్లో రియల్ మీ ముందే విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్ మరియు బడ్స్ ను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. ఈ అప్ కమింగ్ బడ్స్ యొక్క స్పెక్స్ లేదా ఫీచర్స్ కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, ఇండియాలో అందించిన లాంచ్ టీజర్ ఇమేజ్ చూస్తుంటే ఇది కూడా చైనాలో విడుదలైన అదే వేరియంట్ అవుతుందని అర్ధం అవుతుంది.

Realme Buds Air 7 Pro

ఈ అప్ కమింగ్ బడ్స్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన టీజర్ పేజీ అందించిన టీజింగ్ చేస్తోంది. ఈ పేజీ నుండి ఈ అప్ కమింగ్ బడ్స్ టీజర్ ఇమేజ్ అందించింది. ఇందులో ఈ బడ్స్ ను గ్రీన్, రెడ్, లైమ్ మరియు వైట్ నాలుగు కలర్స్ లో లాంచ్ చేయనున్నట్లు టీజింగ్ చేస్తోంది.

ఇక ఈ బడ్స్ యొక్క అంచనా ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ బడ్స్ డ్యూయల్ డ్రైవర్ తో అందిస్తుంది. ఇందులో 11mm ఉఫర్ మరియు 6mm ట్వీటర్ లను కలిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ బ్బుడ్స్ 53dB వరకు ANC (యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్) సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ LHDC 5.0 మరియు Hi-Res ఆడియో సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు సపోర్ట్ క్లారిటీ అందించే సత్తా కలిగి ఉండే అవకాశం ఉంటుంది.

Also Read: Soundbar Deal: భారీ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తున్న డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్.!

కాలింగ్ కోసం ఈ బడ్స్ 6 మైక్ సెటప్ వ్ ఉంటుంది. ఇందులో FB మైక్, FF మైక్ మరియు టాక్ ఎం మిక్స్ ఉంటాయి. ఈ బడ్స్ అధిక సమయం పని చేసే ఆకట్టుకునే బ్యాటరీ మరియు ప్లే టైమ్ తో వచ్చే అవకాశం ఉంటుంది. చైనా వేరియంట్ కలిగిన ఫీచర్స్ ద్వారా ఈ బడ్స్ అంచనా వేసి చెబుతున్నాము. అయితే, ఈ బడ్స్ గురించి పూర్తి వివరాలు అధికారికంగా విడుదలయ్యే వరకు అంచనా ఫీచర్స్ మాత్రమే చూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo