Bharat Taxi App: మొట్టమొదటి కోఆపరేటివ్ బేస్డ్ టాక్సీ సర్వీస్ ప్రారంభించిన ప్రభుత్వం!

HIGHLIGHTS

కేంద్ర ప్రభుత్వం ఈరోజు సంచలనమైన న్యూస్ అందించింది

మొట్టమొదటి కోఆపరేటివ్ బేస్డ్ టాక్సీ సర్వీస్ Bharat Taxi App ను కేంద్రం ప్రారంభించింది

ఈ కొత్త సర్వీస్ తో తక్కువ ఖర్చుతో సురక్షితమైన ప్రయాణం చేసే అవకాశం దేశ ప్రజలకు అందించారు

Bharat Taxi App: మొట్టమొదటి కోఆపరేటివ్ బేస్డ్ టాక్సీ సర్వీస్ ప్రారంభించిన ప్రభుత్వం!

Bharat Taxi App: కేంద్ర ప్రభుత్వం ఈరోజు సంచలనమైన న్యూస్ అందించింది. మొట్టమొదటి కోఆపరేటివ్ బేస్డ్ టాక్సీ సర్వీస్ ను కేంద్రం ప్రారంభించింది. ఈ సర్వీస్ ను ఈ రోజు యూనియన్ అండ్ హోమ్ అఫైర్స్ మినిస్టర్, అమిత్ షా చేతుల మీదుగా ఆరంభించారు. ఈ కొత్త సర్వీస్ తో తక్కువ ఖర్చుతో సురక్షితమైన ప్రయాణం చేసే అవకాశం దేశ ప్రజలకు అందించారు. ఇది లాభాల కోసం కాకుండా ప్రజల కోసం ప్రభుత్వం అందించిన సర్వీస్ గా పొగడబడుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Bharat Taxi App: ఏమిటి ఈ సర్వీస్?

ఇప్పటికే అందరికీ పరిచయం ఉన్న Rapido, Uber మరియు Ola మాదిరిగా పని చేసే యాప్ ను భారత్ ప్రభుత్వం ప్రజల కోసం అందించింది. అదే, ఈ భారత్ టాక్సీ యాప్ మరియు ఈ యాప్ చాలా సురక్షితమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కొత్త యాప్ లో టాక్సీ, ఆటోరిక్షా, మరియు బైక్ వంటి అన్ని సర్వీసులు అందుబాటులో ఉంచింది. ఈ సర్వీస్ తో ర్యాపిడో, ఉబర్ మరియు ఓలా వంటి మరిన్ని ప్రైవేట్ టాక్సీ సర్వీస్ లకు చెక్ పెట్టే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Also Read: Google Pixel 10a: ప్రీ ఆర్డర్ కి అందుబాటులోకి పిక్సెల్ 19 సిరీస్ బడ్జెట్ ఫోన్.!

Bharat Taxi App: ఈ యాప్ ఫీచర్స్ ఏమిటి?

ఈ కొత్త యాప్ ప్రస్తుతం నడుస్తున్న ఇతర యాప్స్ కలిగిన అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంటే, లైవ్ ట్రాకింగ్, SOS, 24×7 ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ మరియు మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ ఈ యాప్ లో వున్నాయి. ఈ యాప్ లో ఛార్జ్ చేయనున్న డే టైమ్స్ (5AM – 10PM) ఫేర్ రేట్లు కూడా ముందుగా లిస్ట్ అవుట్ చేయడం విశేషం. అంటే, ఎక్కువగా రద్దీగా ఉండే సమయాల్లో కూడా ట్రావెల్ ఫేర్ రేట్లు పెంచే అవకాశం లేకుండా ఈ యాప్ లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు మనం చూడవచ్చు. భారత్ టాక్సీ సర్వీస్ లో లిస్ట్ అవుట్ చేసిన ఛార్జ్ రేట్లు ఈ క్రింద అందించిన ఇమేజ్ లో చూడవచ్చు.

Bharat Taxi App launched

ఈ సర్వీస్ లో ఎలా జాయిన్ అవ్వాలి?

ఈ సర్వీస్ నుంచి మీరు డబ్బు సంపాదించడానికి డ్రైవర్ గా జాయిన్ అవ్వొచ్చు. దీనికోసం మీరు ‘భారత్ టాక్సీ డ్రైవర్ యాప్’ ద్వారా మీ వివరాలు అందించింది జాయిన్ అవ్వొచ్చు. ఈ భారత్ టాక్సీ డ్రైవర్ లో మీరు రైడ్ రిక్వెస్ట్ స్వీకరించడానికి, ట్రిప్‌ లను సజావుగా నిర్వహించడానికి మరియు కస్టమర్‌ లతో సులభంగా మరియు సజావుగా కనెక్ట్ అవ్వవచ్చు. ఇది దాదాపు రాపిడో కెప్టెన్, ఓలా డ్రైవర్ మరియు ఉబర్ డ్రైవర్ యాప్ మాదిరిగానే ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo