Google Pixel 10a: ప్రీ ఆర్డర్ కి అందుబాటులోకి పిక్సెల్ 10 సిరీస్ బడ్జెట్ ఫోన్.!

HIGHLIGHTS

గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ను గత సంవత్సరం అందించిన గూగుల్

ఈ సిరీస్ బడ్జెట్ ఫోన్ అయిన గూగుల్ పిక్సెల్ 10a ఫోన్ ను కూడా విడుదల చేస్తోంది

Google Pixel 10a ప్రీ ఆర్డర్ ఈ నెల మధ్యలో ప్రారంభం చేయనున్నట్లు కూడా అనౌన్స్

Google Pixel 10a: ప్రీ ఆర్డర్ కి అందుబాటులోకి పిక్సెల్ 10 సిరీస్ బడ్జెట్ ఫోన్.!

Google Pixel 10a: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ను గత సంవత్సరం అందించిన గూగుల్ ఇప్పుడు ఈ సిరీస్ బడ్జెట్ ఫోన్ అయిన గూగుల్ పిక్సెల్ 10a ఫోన్ ను కూడా విడుదల చేస్తోంది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ ఈ నెల మధ్యలో ప్రారంభం చేయనున్నట్లు కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. అంటే, ఈ ఫోన్ అదే రోజు లాంచ్ అవుతుంది మరియు ప్రీ ఆర్డర్ కి అందుబాటులోకి కూడా వస్తుంది. ఈ లేటెస్ట్ గూగుల్ పిక్సెల్ ఫోన్ గురించి కంపెనీ అందించిన వివరాలు ఏమిటో ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Google Pixel 10a : లాంచ్

గూగుల్ పిక్సెల్ 10a స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి ముందే ప్రస్తావించిన కంపెనీ, ఈరోజు ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ డేట్ ను రివీల్ చేసింది. 13 ఫిబ్రవరి 2026 మధ్యాహ్నం 1:29 (1:29 PM IST) గంటల నుంచి ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ స్టార్ చేస్తుంది. ఈ ఫోన్ ను ముందుగా బుక్ చేయదలచిన యూజర్లు ఈ ఫోన్ ప్రీ బుకింగ్ స్టార్ అయిన వెంటనే బుక్ చేసుకోవచ్చు. కంపెనీ అఫీషియల్ X అకౌంట్ నుంచి ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ కోసం అందించిన టీజర్ వీడియో నుంచి ఈ వివరాలు అందించింది. అంతేకాదు, గూగుల్ స్టోర్ నుంచి కూడా ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ టీజర్ పేజీ ని లిస్ట్ చేసింది.

Google Pixel 10a Pre Orders

గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ బడ్జెట్ ఫోన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న గూగుల్ పిక్సెల్ ఫోన్ ప్రేమికులకు ఇది మంచి జోష్ ఇచ్చే న్యూస్ అవుతుంది. ఈ ఫోన్ ను 50 నుంచి 60 వేల మధ్యస్థ ధరలో అందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Also Read: చవక ధరలో 5.2 Dolby Soundbar అందుకునే గొప్ప ఛాన్స్ మిస్ అవ్వకండి.!

Google Pixel 10a : ఫీచర్స్ (Expected)

గూగుల్ ఇంకా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ లేదా ఫీచర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్స్ గత కొంత కాలంగా నెట్టింట్లో బాగా సర్కిల్ అవుతున్నాయి. వాటి ద్వారా ఈ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్స్ పై అందిస్తున్నాము. ఈ ఫోన్ 6.3 ఇంచ్ OLED స్క్రీన్ ను FHD+ రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు అధిక బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Google Tensor G4 చిప్ సెట్ తో వస్తుంది. దీనికి జతగా 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో OIS సపోర్ట్ కలిగిన 48MP డ్యూయల్ మెయిన్ కెమెరా జతగా 13MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగి ఉంటుంది మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5100 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ తో పాటు 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉండే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo