Voter ID వివరాలు ఆన్‌ లైన్‌ లో ఎలా చెక్ చేయాలి.. లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి.!

Highlights

భారత ఎన్నికల సంఘం ఇప్పుడు ఓటర్ల కోసం ఆన్‌ లైన్‌ సర్వీస్ ని అందిరికీ అందుబాటులోకి తెచ్చింది

ఓటరు జాబితాలో పేరు, పోలింగ్ బూత్ వివరాలు తెలుసుకునే సదుపాయాన్ని అందిస్తోంది

Voter ID వివరాలు ఆన్‌ లైన్‌ లో ఎలా చెక్ చేయాలి

Voter ID వివరాలు ఆన్‌ లైన్‌ లో ఎలా చెక్ చేయాలి.. లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి.!

గతంలో ఒక వ్యక్తి ఓటర్ ఐడి కార్డ్ కి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆఫీసుని సంప్రదించాల్సి వచ్చేది. అయితే, భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ఇప్పుడు ఓటర్ల కోసం ఆన్‌ లైన్‌ సర్వీస్ ని అందిరికీ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఓటర్ ఐడీ వివరాలు, ఓటరు జాబితాలో పేరు, పోలింగ్ బూత్ వివరాలు తెలుసుకునే సదుపాయాన్ని అందిస్తోంది. ఓటర్లు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ఎప్పటి కప్పుడు ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా, ఓటర్ ఐడీ కార్డు చేతిలో ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో కచ్చితంగా నిర్ధారించుకోవాలి. అందుకే, ఈరోజు Voter ID వివరాలు ఆన్‌ లైన్‌ లో ఎలా చెక్ చేయాలి మరియు లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో ఈరోజు చూద్దాం.

Voter ID వివరాలు ఆన్‌ లైన్‌ లో ఎలా చెక్ చేయాలి?

ముందుగా ఓటర్ ఐడి వివరాలు ఆన్‌ లైన్‌ లో ఎలా చెక్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం.

  • ముందుగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ electoralsearch.eci.gov.in/ ఓపెన్ చేయండి.
  • అక్కడ Search by EPIC, Search by Details, Search by Mobile అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
  • మీ దగ్గర ఓటర్ ఐడీ నంబర్ ఉంటే Search by EPIC ఆప్షన్ ఎంచుకోండి.
  • మీ EPIC నంబర్, రాష్ట్రం వివరాలను నమోదు చేయండి.
  • స్క్రీన్‌ పై కనిపించే క్యాప్చా కోడ్‌ ను ఎంటర్ చేసి Search బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీ ఓటరు వివరాలు జాబితాలో ఉంటే స్క్రీన్‌ పై కనిపిస్తాయి.

Voter ID నెంబర్ లేకపోతే ఎలా చెక్ చేయాలి?

ఓటర్ ఐడీ నంబర్ ఉంటే మాత్రమే ఓటర్ ఐడి వివరాలు తెలుస్తాయి, అనుకోకండి. ఓటర్ ఐడి అందుబాటులో లేకపోయినా కూడా మీరు మీ ఓటర్ ఐడి వివరాలు ఆన్లైన్ లివ్ చెక్ చేయవచ్చు. దీనికోసం పైన సూచించిన సైట్ లోకి వెళ్ళి Search by Details ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ మీ పేరు, తండ్రి లేదా భర్త పేరు, వయస్సు లేదా పుట్టిన తేదీ, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం వంటి వివరాలను నమోదు చేయండి. ఇలా కూడా మీ ఓటర్ ఐడి వివరాలు అందుకునే అవకాశం ఉంటుంది. అలాగే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా కూడా వెతికే అవకాశం ఉంది.

మీ మొబైల్‌ లోనే చెక్ చేసుకోవచ్చు

కంప్యూటర్ అవసరం లేకుండానే మొబైల్‌ లో Voter Helpline యాప్ లేదా ECINET యాప్ ద్వారా మీ ఓటరు వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఓటర్ హెల్ప్‌ లైన్ నంబర్ 1950 కు కాల్ చేసి సహాయం పొందవచ్చు.

Voter ID and voter list

పేరు కనిపించకపోతే ఏం చేయాలి?

అన్ని వివరాలతో వెతికినా ఓటరు జాబితాలో మీ పేరు కనిపించకపోతే మీరు వెంటనే సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించాలి. కొత్తగా పేరు నమోదు చేసుకోవడానికి Form 6, ఇప్పటికే ఉన్న వివరాల్లో మార్పులు లేదా చిరునామా మార్పు కోసం Form 8 ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

ఇక ఓటర్ లిస్ట్ లో మీ వివరాలు ఎలా చెక్ చేయాలి

దీనికోసం మీరు మీ ఏరియా వివరాలతో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. దీనికోసం voters.eci.gov.in/download-eroll సైట్ ఓపెన్ చేయండి. ఇందులో మీ రాష్ట్రం ఎంచుకోగానే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీ జిల్లా, అసెంబ్లీ స్థానం పేరు మరియు భాష ఎంచుకొని క్రింద ఉండే Captcha ని ఎంటర్ చేసి మీ ఊరు మరియు ఇక్కడ పోలింగ్ బూత్ ఎంచుకుని పక్కన ఉన్న డౌన్‌లోడ్ PDF File పైన నొక్కండి. ఇక్కడ మీ ఊరు లేదా బూత్ ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ అవుతుంది. అందులో మీ వివరాలు చెక్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile