Night Charging Ban: ఇక నుంచి రైళ్లల్లో రాత్రి ఛార్జింగ్ సౌకర్యం ఉండదు .. ఎందుకంటే.!
రైలు లో రాత్రిపూట ప్రయాణం చేసే వారికి ముఖ్యమైన అప్ డేట్
ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జింగ్ చేసుకునే సదుపాయంపై రాత్రి వేళల్లో పూర్తిగా నిషేదం
అగ్ని ప్రమాదాల ముప్పును తగ్గించేందుకు రైల్వే శాఖ ఈ నిబంధనలను అమలు చేస్తోంది
Night Charging Ban: భారతీయ రైల్వే శాఖ రైలు లో రాత్రిపూట ప్రయాణం చేసే వారికి ముఖ్యమైన అప్ డేట్ అందించింది. రైల్వే కోచ్ లలో మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జింగ్ చేసుకునే సదుపాయంపై రాత్రి వేళల్లో పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఛార్జింగ్ పాయింట్లను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక ప్రయాణికుల భద్రతే ప్రధాన కారణంగా ఉన్నట్లు పేర్కొంది. రైలు ప్రయాణంలో అగ్ని ప్రమాదాల ముప్పును తగ్గించేందుకు రైల్వే శాఖ ఈ నిబంధనలను అమలు చేస్తోంది.
SurveyNight Charging Ban: కారణం ఏమిటి?
రైల్వే కోచ్ లలో ఎలక్ట్రికల్ డివైజెస్ వినియోగం విషయంలో భద్రతకు రైల్వే శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ఛార్జ్ పోర్ట్ లో సమస్య లేకున్నా ప్రయాణికులు నాసిరకం ఛార్జర్లు, దెబ్బతిన్న కేబుళ్లు, నాణ్యతలేని పవర్ బ్యాంకు వంటి వాటిని ఉపయోగిస్తే అవి వేడెక్కడం లేదా షార్ట్ సర్క్యూట్ కు కారణమయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలు రైలు ప్రయాణంలో పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు.

అయితే, ఇలాంటి సంఘటనలు పగలు జరిగితే వాటిని వెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది. కానీ, రాత్రి సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉండడం వలన ప్రమాదాలు వెంటనే గుర్తించడం కష్టమవుతుంది. అందువల్ల, ఛార్జింగ్ సదుపాయాన్ని నిర్దిష్ట సమయాల్లో నిలిపివేయడం ద్వారా ప్రమాదాల ముప్పును తగ్గించాలన్నది రైల్వే శాఖ ఉద్దేశం.
Also Read: Sony Dolby సౌండ్ బార్స్ అమెజాన్ GIF Sale నుంచి ఆల్ టైం చవక ధరలో లభిస్తున్నాయి.!
Night Charging Ban: ప్రయాణికులు ఈ విషయాలు గుర్తుంచుకోండి
ఎవరైనా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ బ్యాటరీ అయిపోతే ఛార్జింగ్ పాయింట్ కోసం వెతకడం సర్వ సాధారణం. అయితే, ఇక నుంచి రాత్రి వేళల్లో ఈ సదుపాయం మీకు అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే, ప్రయాణానికి ముందే మీ ఫోన్, పవర్ బ్యాంక్ లేదా ఇంకేదైనా అవసరమైన ఇతర పరికరాలను పూర్తిగా ఛార్జ్ చేసుకోవడం మంచిది.
ముఖ్యంగా, రాత్రంతా ప్రయాణించే వారు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు ట్రైన్ ప్రయాణంలో మీరు మీ ఫోన్ లేదా ఇతర పరికరాలు ఛార్జ్ చేయాలనుకుంటే, రాత్రి 11 గంటల కంటే ముందే ఛార్జ్ చేసుకోవడం మంచిది. లేదంటే మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
ఇది రైల్వే కొత్తగా తీసుకొచ్చిన నిబంధన కాదని గమనించాలి. నిజానికి ఇది ఇప్పటికే అమలులో ఉన్న నిబంధన. అయితే, ఈ నియమాన్ని ఇప్పుడు మరింత కఠినతరం చేసినట్లు పేర్కొన్నారు. అందుకే, ప్రయాణికులు తమ రైలు, కోచ్‌కు సంబంధించిన తాజా సూచనలను కూడా పరిశీలించడం మంచిది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
