Jio New Plans: 5G డేటా అండ్ వాయిస్ ఓన్లీ ఆప్షన్ పై ఫోకస్ చేసిన జియో.!

HIGHLIGHTS

రిలయన్స్ జియో యూజర్లకు రెండు అంశాలు ఆసక్తికరంగా మారాయి

వాయిస్ కాల్స్ మరియు SMS బెనిఫిట్స్ అందించే రీఛార్జ్ పై జోరుగా చర్చ జరుగుతోంది

TRAI నిబంధనల అనుసారం జియో రీఛార్జ్ ప్లాన్ల పై వినియోగదారుల్లో ఆసక్తి పెరిగింది

Jio New Plans: 5G డేటా అండ్ వాయిస్ ఓన్లీ ఆప్షన్ పై ఫోకస్ చేసిన జియో.!

Jio New Plans: రీఛార్జ్ ప్లాన్ విషయంలో ప్రస్తుతం రిలయన్స్ జియో యూజర్లకు రెండు అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఒకవైపు అన్లిమిటెడ్ 5G డేటా, OTT సబ్‌స్క్రిప్షన్లతో పాటు ఏడాది వ్యాలిడిటీతో కూడిన ప్లాన్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. మరోవైపు, డేటా అవసరం లేని వారికి వాయిస్ కాల్స్ మరియు SMS బెనిఫిట్స్ మాత్రమే అందించే రీఛార్జ్ ఆప్షన్ పై జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, అక్టోబర్ 21 నుంచి అమల్లోకి వచ్చిన TRAI నిబంధనల అనుసారం జియో రీఛార్జ్ ప్లాన్ల పై వినియోగదారుల్లో ఆసక్తి పెరిగింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio New Plans:

ప్రస్తుతం జియో అధికారిక వెబ్‌ సైట్‌ లో అందుబాటులో ఉన్న ప్లాన్లలో రూ. 349, రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్స్ బెస్ట్ అన్లిమిటెడ్ 5జి రీఛార్జ్ ప్లాన్స్ గా యూజర్లు చెబుతుండగా, రూ. 189 మరియు రూ. 449 వంటి వాయిస్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.

Jio రూ. 349: బడ్జెట్ 5G యూజర్లకు బెస్ట్

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ జియో ఆఫర్ చేస్తున్న లీస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ 5జి అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ గా యూజర్లు చెబుతారు. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 28 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5G డేటా మరియు రోజుకు 100 SMS వినియోగ ప్రయోజనం లభిస్తుంది. అంతేకాదు, 4జి నెట్ వర్క్ పైన డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా, జియో హాట్ స్టార్ OTT, గూగుల్ జెమినీ ప్రో మరియు జియో ఏఐ క్లౌడ్ యాక్సెస్ కూడా లభిస్తుంది.

Jio రూ. 899: 5G యూజర్లకు బెస్ట్ లాంగ్ ప్లాన్

ఇది 90 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించే జియో బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ గా చెప్పబడుతుంది. ఇది జియో ఆఫర్ చేస్తున్న బెస్ట్ లాంగ్ ప్లాన్ గా కూడా యూజర్లు చెబుతారు. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 90 రోజుల పాటు అన్లిమిటెడ్ 5జి డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100SMS వినియోగ ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2జీబీ 4జి డేటా మరియు 20GB అదనపు డేటా కూడా అందిస్తుంది. అలాగే, జియో హాట్ స్టార్ OTT, గూగుల్ జెమినీ ప్రో మరియు జియో ఏఐ క్లౌడ్ యాక్సెస్ కూడా లభిస్తుంది.

Jio New Plans

Jio రూ. 448: బెస్ట్ వాయిస్ ఓన్లీ ప్లాన్

ఇది జియో లేటెస్ట్ గా అందించిన వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఇది ఏకంగా 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అందిస్తుంది మరియు పూర్తి వ్యాలిడిటీ కాలానికి 1000 SMS బెనిఫిట్ కూడా అందిస్తుంది. అలాగే, జియో టీవీ మరియు జియో క్లౌడ్ యాక్సెస్ కూడా అందిస్తుంది.

Also Read: అమెజాన్ GIF Sale నుంచి TCL QD-Mini LED స్మార్ట్ టీవీ పై అదిరిపోయే డీల్..!

జియో రూ. 189 ప్లాన్ : బెస్ట్ ఆల్ రౌండ్ ప్లాన్

యూజర్లకు జియో అందించిన అత్యంత సరమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఇది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే వారికి 28 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, వ్యాలిడిటీ కాలానికి 2 జీబీ డేటా మరియు 300 SMS బెనిఫిట్స్ అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile