అమెజాన్ GIF Sale నుంచి TCL QD-Mini LED స్మార్ట్ టీవీ పై అదిరిపోయే డీల్..!
ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి స్మార్ట్ టీవీ ఆఫర్ అందుబాటులో ఉంది
55 ఇంచ్ QD-Mini LED స్మార్ట్ టీవీ ఈరోజు మంచి ఆఫర్స్ తో బెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది
ఈ డీల్ మీకు అమెజాన్ GIF Sale నుంచి లభిస్తుంది
సినిమాలు చూడాలన్నా, క్రికెట్ మ్యాచ్ లను ఆస్వాదించాలన్నా లేదా హై-క్వాలిటీ గేమింగ్ ఆడాలన్నా కూడా మంచి ఫీచర్లతో కూడిన పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీ అవసరం. మీరు కూడా అలా అనుకుంటుంటే, మీకోసం ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి స్మార్ట్ టీవీ ఆఫర్ అందుబాటులో ఉంది. అదేమిటంటే, TCL రీసెంట్ గా విడుదల చేసిన ప్రీమియం 55 ఇంచ్ QD-Mini LED స్మార్ట్ టీవీ ఈరోజు మంచి ఆఫర్స్ తో బెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది. ఈ టీవీ 4K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు Onkyo 2.1 ఛానల్ ఆడియో వంటి చాలా ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. ఈ డీల్ మీకు అమెజాన్ GIF Sale నుంచి లభిస్తుంది.
SurveyTCL QD-Mini LED స్మార్ట్ టీవీ : ఆఫర్
అమెజాన్ ఈ స్మార్ట్ టీవీ పై బిగ్ డీల్స్ అందించింది. ముందుగా ఈ టీవీని 44% డిస్కౌంట్ తో రూ. 59,990 రూపాయల ఆఫర్ ప్రైస్ తో లిస్ట్ చేసిన కంపెనీ, ఈ టీవీపై రూ. 3,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ కూడా అందించింది. అంతేకాదు, సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ పైన రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 54,990 రూపాయల ఆఫర్ ధరతో పండుగ సేల్ నుంచి మీకు లభిస్తుంది. Buy From Here
Also Read: Infinix GT 50 Pro: హైడ్రో ఫ్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో రిలీజ్ అయ్యింది.!
TCL QD-Mini LED స్మార్ట్ టీవీ : ఫీచర్స్
ఈ స్మార్ట్ టీవీ 55 అంగుళాల QD-Mini LED టెక్నాలజీ స్క్రీన్ తో వస్తుంది. ఇది 4K UHD రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ తో కంటెంట్ ను మరింత స్పష్టంగా అందిస్తుంది. ఈ మోడల్ లో 512కు పైగా లోకల్ డిమ్మింగ్ జోన్లు ఉండటం వల్ల స్క్రీన్ లోని వివిధ ప్రాంతాల్లో బ్రైట్నెస్ ని నియంత్రించి, చీకటి దృశ్యాల్లో మెరుగైన కాంట్రాస్ట్ ను అందించే అవకాశం ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ వేగంగా కదిలే దృశ్యాలు, స్పోర్ట్స్, అనుకూలమైన గేమింగ్ కంటెంట్‌ను మరింత స్మూత్‌గా చూపించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా, ఈ టీవీ లో IMAX Enhanced సపోర్ట్ కూడా ఉండటం వలన స్క్రీన్ పైన పిక్చర్ పెద్దగా కనిపిస్తుంది.

ఈ టీవీలో 3GB RAM ఉండటం వల్ల యాప్ లు చాలా వేగంగా ఓపెన్ అవుతాయి మరియు ల్యాగ్ ఫ్రీ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇక ఆడియో విషయానికి వస్తే, ఇందులో డాల్బీ అట్మోస్ 46W Onkyo 2.1 ఛానల్ సౌండ్ సిస్టమ్ ఉంది. ఇది సినిమాలు, పాటలు, స్పోర్ట్స్ వంటి వాటిని మరింత ఇమర్సివ్ గా ఆస్వాదించడానికి తోడ్పడుతుంది. పెద్ద స్క్రీన్, అధిక రిఫ్రెష్ రేట్, స్మార్ట్ ఫీచర్లు, ప్రత్యేక ఆడియో సిస్టమ్ కలయికతో ఇంట్లోనే థియేటర్ తరహా అనుభూతిని కోరుకునేవారికి ఈ మోడల్ పరిశీలించ దగిన గొప్ప ఎంపిక అవుతుంది. ఇది డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
