BSNL New Plan: డైలీ 3GB డేటా అండ్ అన్లిమిటెడ్ లాభాలు అందించే కొత్త ప్లాన్ తెచ్చింది.!

HIGHLIGHTS

ప్రతినెలా మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉండే వారికి బెస్ట్ ప్లాన్

లాంగ్ వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ కోసం చూసే యూజర్ల కోసం బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్ అందించింది

తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం డైలీ 3GB డేటా అండ్ అన్లిమిటెడ్ లాభాలు

BSNL New Plan: డైలీ 3GB డేటా అండ్ అన్లిమిటెడ్ లాభాలు అందించే కొత్త ప్లాన్ తెచ్చింది.!

BSNL New Plan: ప్రతినెలా మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం ఇబ్బందిగా భావించి లాంగ్ వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ కోసం చూసే యూజర్ల కోసం బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్ అందించింది. బడ్జెట్ యూజర్లకు కూడా ఈ కొత్త ఏడాది వ్యాలిడిటీ ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే, తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం డైలీ 3GB డేటా అండ్ అన్లిమిటెడ్ లాభాలు అందించే మొబైల్ సేవలు ఈ ప్లాన్ అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ అందించిన ఈ బెస్ట్ ప్లాన్ కంప్లీట్ డిటైల్స్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL New Plan: ఏమిటి ఈ ప్లాన్?

బిఎస్ఎన్ఎల్ రీసెంట్ గా విడుదల చేసిన రూ. 2,799 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లడుకుంటోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ ధరలో కంప్లీట్ బెనిఫిట్స్ అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా కూడా చెప్పబడుతుంది.

BSNL రూ.2,799 ప్లాన్ ప్రయోజనాలు ఏమిటి?

ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 3GB హై స్పీడ్ డేటా మరియు ఈ హై స్పీడ్ డేటా ముగిసిన తర్వాత కూడా 40 Kbps వేగంతో అపరిమిత డేటా అందిస్తుంది. అంతేకాదు, వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలు కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్ల కోసం అందుబాటులో ఉంది.

BSNL New Plan rs 2799

ఈ ప్లాన్ కోసం రోజుకు ఎంత ఖర్చవుతుంది?

ఈ బిఎస్ఎన్ఎల్ రూ. 2,799 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ను 365 రోజులకు లెక్కిస్తే రోజుకు సుమారు రూ.7.67 ఖర్చవుతుంది. రోజూ ఇంటర్నెట్ ఉపయోగించే వారు, ఫోన్ కాల్స్ ఎక్కువగా చేసే వారు, ఏడాది పాటు ఒకేసారి రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారు ఈ తరహా ప్లాన్‌ ను పరిశీలించవచ్చు.

Also Read: Rebel 5G తో రీఎంట్రీకి సిద్ధమైన Karbonn Mobiles .. ప్రైస్ అండ్ ఫీచర్లపై ఆసక్తికర అప్‌ డేట్!

రీఛార్జ్ చేసే ముందు గమనించాల్సిన విషయాలు

బిఎస్ఎన్ఎల్ నెట్‌ వర్క్ కవరేజ్ ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. అందువల్ల మీ ప్రాంతంలో 4G సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం మంచిది. అలాగే ప్లాన్ ధర, వ్యాలిడిటీ, కాలింగ్, SMS, డేటా ప్రయోజనాలు మీ టెలికాం సర్కిల్‌లో అందుబాటులో ఉన్నాయో లేదో నిర్ధారించుకున్న తర్వాత రీఛార్జ్ చేయడం మంచిది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile