ఒద్దికైన సైజులో రెండు కొత్త Dolby Audio సౌండ్ బార్స్ లాంచ్ చేసిన Zebronics బ్రాండ్.!
Zebronics ఈరోజు ఇండియన్ మార్కెట్లో రెండు కొత్త సౌండ్ బార్స్ విడుదల చేసింది
ఈ రెండు సౌండ్ బార్ లను Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో అందించింది
సరికొత్త కాంపాక్ట్ అండ్ డౌన్ ఫైరింగ్ ఉఫర్ తో ఈ సౌండ్ బార్స్ అందించింది
ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ Zebronics ఈరోజు ఇండియన్ మార్కెట్లో రెండు కొత్త సౌండ్ బార్స్ విడుదల చేసింది. ఈ రెండు సౌండ్ బార్ లను కూడా Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో అందించింది. ఇది కామన్ విషయమే అయినా ఈ కొత్త సౌండ్ బార్స్ కలిగిన డిజైన్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే, కంపెనీ ఇన్నాళ్లు కొనసాగిస్తూ వచ్చిన సాంప్రదాయ డిజైన్ ను పక్కన పెట్టి ఒద్దికైన సైజులో కొత్త కాంపాక్ట్ డిజైన్ తో ఈ సౌండ్ బార్ లను రిలీజ్ చేసింది.
SurveyZebronics Dolby Audio సౌండ్ బార్ : ప్రైస్
జెబ్రోనిక్స్ ఈరోజు కొత్తగా Juke Bar 9300C మరియు Juke Bar 9010C రెండు సౌండ్ బార్ లను మార్కెట్లో విడుదల చేసింది. ఈ రెండు బార్ ప్రైస్ విషయానికి వస్తే, ఇందులో Juke Bar 9010C (2.1 ఛానల్) సౌండ్ బార్ ను రూ. 6,999 అందించగా, Juke Bar 9300C (5.1 ఛానల్) సౌండ్ బార్ ను మాత్రం రూ. 9,999 ప్రైస్ ట్యాగ్ తో రిలీజ్ చేసింది. ఈ రెండు సౌండ్ బార్ లు కూడా ఈరోజు నుంచి అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కోసం అందుబాటులోకి వచ్చాయి. ఈ సౌండ్ బార్స్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందించింది.

Juke Bar 9010C (2.1 ఛానల్) సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ సౌండ్ బార్ కొత్త ఒద్దికైన కాంపాక్ట్ రూపంలో ఉంటుంది. ఇది 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు డాల్బీ ఆడియో జతగా టోటల్ 140W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఇందులో రెండు స్పీకర్లు మరియు ఒక ట్వీటర్ కలిగిన చాలా కాంపాక్ట్ బార్ ఉంటుంది. ఇది గోడకు తగిలించే ఫీచర్ తో కూడా వస్తుంది. అలాగే, ఈ సౌండ్ బార్ తో డౌన్ ఫైరింగ్ సబ్ ఉఫర్ కూడా వస్తుంది. ఇందు సైడ్ ఉఫర్ తో సబ్ ఉఫర్ అందించిన జెబ్రోనిక్స్, ఈ సిరీస్ లో డౌన్ ఫైరింగ్ సబ్ ఉఫర్ అందించింది. Buy From Here
Also Read: Bharat Taxi App: మొట్టమొదటి కోఆపరేటివ్ బేస్డ్ టాక్సీ సర్వీస్ ప్రారంభించిన ప్రభుత్వం!
Juke Bar 9300C (5.1 ఛానల్) సౌండ్ బార్ : ఫీచర్స్
ఇది జెబ్రోనిక్స్ కొత్తగా అందించిన 5.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ మరియు టోటల్ 380W సౌండ్ ఔట్ పుట్ తో వస్తుంది. ఇందులో మూడు స్పీకర్లు మరియు ట్వీటర్ కలిగిన బార్, డ్యూయల్ రియర్ వైర్డ్ శాటిలైట్ స్పీకర్లు మరియు 105W జబర్దస్త్ సౌండ్ అందించే డౌన్ ఫైరింగ్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ చాలా కాంపాక్ట్ సైజులో ఉంటుంది మరియు మంచి సౌండ్ అందించే సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఇది సరికొత్త రుపంలో ఉంటుంది సరికొత్త సెటప్ తో ఉంటుంది. Buy From Here
జెబ్రోనిక్స్ కొత్తగా విడుదల చేసిన ఈ రెండు సౌండ్ బార్స్ కూడా HDMI Arc, USB, ఆప్టికల్ ఇన్, AUX మరియు లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 5.4 వంటి టోటల్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉన్నాయి.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile