SONY BRAVIA 2 Smart Tv పై బిగ్ డీల్స్ అందించిన ఫ్లిప్ కార్ట్ సేల్.!
SONY BRAVIA 2 Smart Tv ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది
ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ బచాత్ సేల్ నుంచి ఈ డీల్ అందించింది
ఈ టీవీ గొప్ప విజువల్స్ అందించే స్క్రీన్ మరియు గొప్ప సౌండ్ అందించే ఫీచర్స్ కలిగి ఉంటుంది
SONY BRAVIA 2 Smart Tv స్మార్ట్ టీవీ ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ నెల ప్రారంభంలో ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ బచాత్ సేల్ నుంచి ఈ డీల్ అందించింది. ఈ టీవీ భారీ గొప్ప విజువల్స్ అందించే స్క్రీన్ మరియు గొప్ప సౌండ్ అందించే ఫీచర్స్ కలిగి ఉంటుంది. సోను బ్రాండ్ నుంచి వచ్చిన ఈ టీవీపై ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ డీల్స్ తెలుసుకోండి.
SurveySONY BRAVIA 2 Smart Tv : డీల్స్
ముందుగా ఫ్లిప్ కార్ట్ సేల్ విషయానికి వస్తే, ఈ సేల్ ఈరోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది. అందుకే, ఈ ఆఫర్ మీకు కేవలం ఈరోజు ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక టీవీ డీల్ విషయానికి వస్తే, సోనీ బ్రావియా 2 సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ K-55S25EM2 పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ టీవీని ఈరోజు 39% భారీ డిస్కౌంట్ తో రూ. 55,990 ఆఫర్ ధరతో సేల్ చేస్తోంది.

ఇది కాకుండా ఈ టీవీ పై రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ టీవీని క్రెడిట్, డెబిట్ UPI మరియు EMI ఏ ఆప్షన్ తో తీసుకున్నా కూడా ఈ అదనపు డిస్కౌంట్ మీకు లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ మీకు రూ. 53,990 రూపాయల డిస్కౌంట్ ధరలో మీకు లభిస్తుంది. అదే ఈ టీవీని Flipkart Axis మరియు Flipkart SBI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 4,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: ఒద్దికైన సైజులో రెండు కొత్త Dolby Audio సౌండ్ బార్స్ లాంచ్ చేసిన Zebronics బ్రాండ్.!
SONY BRAVIA 2 Smart Tv : ఫీచర్స్
ఈ సోనీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన గొప్ప LED స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ సోనీ యొక్క ప్రత్యేకమైన 4K Processor X1 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ టీవీ లైవ్ కలర్, 4K X-Reality PRO, HDR 10 మరియు HLG వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ లేటెస్ట్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది.
సౌండ్ పరంగా, ఈ సోనీ బ్రావియా స్మార్ట్ టీవీ రెండు ఓపెన్ బఫెల్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 20W సౌండ్ అందిస్తుంది. అయితే, ఈ టీవీ డాల్బీ అట్మాస్ మరియు DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు క్రిస్టల్ క్లియర్ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, 4 HDMI పోర్ట్స్, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile