ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన కొత్త 55 ఇంచ్ QLED Smart Tv ఒకటి ఈరోజు బిగ్ డిస్కౌంట్ తో కేవలం 43 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే లభిస్తోంది. ఈ టీవీ డాల్బీ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు HDR 10+ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. చవక ధరలో కొత్త స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారిలో మీరు కూడా ఉంటే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేయండి.
Survey
✅ Thank you for completing the survey!
QLED Smart Tv : డీల్
ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Foxsky రీసెంట్ గా విడుదల చేసిన స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ అందించిన డీల్స్ గురించే మనం ఈరోజు మాట్లాడుకుంటుంది. Foxsky యొక్క 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ 75% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 23,999 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. దీనికి తోడు ఈ టీవీని BOB CARD EMI ఆఫర్ తో తీసుకున్న వారికి రూ 1500 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. అంటే, అన్ని ఆఫర్స్ కలుపుకొని ఈటీవీ కేవలం రూ. 22,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.
ఫాక్స్ స్కై యొక్క ఈ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు HDR 10+ సపోర్ట్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రొసెసర్ తో పని చేస్తుంది మరియు ఆండ్రాయిడ్ 12 OS పై నడుస్తుంది. ఈ టీవీ ప్రీమియం మ్యాజిక్ రిమోట్ తో కూడా వస్తుంది.
ఈ టీవీ Dolby Audio సౌండ్ సపోర్ట్ కలిగిన రెండు స్పీకర్లతో మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ 30W సౌండ్ అవుట్ పుట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ HDMI, బ్లూటూత్, USB, బిల్ట్ ఇన్ Wi-Fi, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ తో వస్తుంది మరియు WebOS పై నడుస్తుంది. ఈ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి చాలా చవక ధరలో అందుకోవచ్చు.
ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ అందుకుంది మరియు మంచి రివ్యూలను కూడా అందుకుంది. ముఖ్యంగా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో లభిస్తున్న ఏకైక 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ గా ఇది నిలుస్తుంది.