vivo X200 FE : భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో మొదలైన వివో కొత్త ఫోన్ సేల్.!
వివో రీసెంట్ గా ఎక్స్ 200 సిరీస్ నుంచి విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వివో ఎక్స్ 200 FE సేల్
vivo X200 FE ఈ ఫోన్ పై దాదాపు రూ. 11,000 భారీ డిస్కౌంట్ ఆఫర్స్ వివో అందించింది
ఈ వివో కొత్త ఫోన్ ధర, ఆఫర్లు మరియు ఫీచర్లు తెలుసుకోండి
vivo X200 FE : వివో రీసెంట్ గా ఎక్స్ 200 సిరీస్ నుంచి విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వివో ఎక్స్ 200 FE సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. ఈ ఫోన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ పై దాదాపు రూ. 11,000 భారీ డిస్కౌంట్ ఆఫర్స్ వివో అందించింది. ఈ వివో కొత్త ఫోన్ ధర, ఆఫర్లు మరియు ఫీచర్లు తెలుసుకోండి.
Surveyvivo X200 FE: ప్రైస్
ఈ వివో స్మార్ట్ ఫోన్ బేసిక్ 12 జీబీ + 256 జీబీ వేరియంట్ రూ. 54,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ (16 జీబీ + 512 జీబీ) రూ. 59,999 ప్రైస్ ట్యాగ్ తో వచ్చింది. ఈ ఫోన్ ఈరోజు నుంచి ఫ్లిప్ కార్ట్, అమెజాన్ మరియు వివో అఫీషియల్ సైట్ నుంచి లభిస్తుంది.

ఆఫర్లు :
వివో ఈ ఫోన్ పై భారీ ఆఫర్లు అందించింది. ఈ ఫోన్ పై రూ. 5,500 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ మరియు రూ. 5,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు అందించింది. ఈ ఫోన్ ను HDFC, Axis మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ బ్యాంకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో టోటల్ రూ. 11,000 రూపాయల భారీ తగ్గింపు అందుకోవచ్చు. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 43,999 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది.
Also Read: Moto G86 Power 5G లాంచ్ అనౌన్స్ చేసిన మోటోరోలా: ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!
vivo X200 FE: ఫీచర్లు
ఈ వివో స్మార్ట్ ఫోన్ గొప్ప కాంపాక్ట్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 94.4% స్క్రీన్ టూ బాడీ రేషియో కలిగిన 6.31 ఇంచ్ AMOLED ఉంటుంది. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1.5K రిజల్యూషన్ మరియు HDR 10+ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 9300+ చిప్ సెట్, 16 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 512 జీబీ స్టోరేజ్ తో గొప్ప పెర్ఫార్మన్స్ అందిస్తుంది.
వివో ఎక్స్ 200 FE స్మార్ట్ ఫోన్ లో 50MP ZEISS మెయిన్, 50MP (Sony IMX921 VCS) అల్ట్రా సెన్సింగ్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగి ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 50MP AF సెల్ఫీ కెమెరా అందించింది. ఈ ఫోన్ సూపర్ AI కెమెరా ఫీచర్స్, వివో కెమెరా ఫిల్టర్స్ మరియు ZEISS ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గొప్ప స్టేబుల్ 4K వీడియో షూట్ ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ 6500 mAh బిగ్ బ్యాటరీ మరియు 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.