Vivo V70 Elite: కంప్లీట్ ఫీచర్స్ అండ్ అంచనా ప్రైస్ లాంచ్ కంటే ముందే తెలుసుకోండి.!

HIGHLIGHTS

V సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వి70 ఎలైట్ మరో రెండు రోజుల్లో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది

ఈ ఫోన్ ఫీచర్స్ అండ్ ప్రైస్ గురించి అప్‌డేట్ కోసం ఆన్లైన్ లో సెర్చ్ మొదలైనట్లు తెలుస్తోంది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన వివరాలు ఇక్కడ ఉన్నాయి

Vivo V70 Elite: కంప్లీట్ ఫీచర్స్ అండ్ అంచనా ప్రైస్ లాంచ్ కంటే ముందే తెలుసుకోండి.!

Vivo V70 Elite : వివో ప్రీమియం సిరీస్ గా పేరొందిన V సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వి70 ఎలైట్ మరో రెండు రోజుల్లో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ దగ్గరకు రావడం తో ఈ ఫోన్ ఫీచర్స్ అండ్ ప్రైస్ గురించి అప్‌డేట్ కోసం ఆన్లైన్ లో సెర్చ్ మొదలైనట్లు తెలుస్తోంది. అందుకే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన వివరాలు ఈరోజు అందిస్తున్నాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo V70 Elite : లాంచ్ డేట్ అండ్ టైం

వివో వి 70 ఎలైట్ స్మార్ట్ ఫోన్ మరియు వివో వి70 రెండు స్మార్ట్ ఫోన్ లను కూడా ఫిబ్రవరి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో వివో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ పాషన్ రెడ్, సాండ్ బీజ్ మరియు అథెంటిక్ బ్లాక్ మూడు రంగులో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్, ఫ్లిప్ కార్ట్, వివో అఫీషియల్ సైట్ మరియు అన్ని ప్రధాన రిటైల్ షాప్స్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Vivo V70 Elite : ఫీచర్స్

వివో వి70 ఎలైట్ ఫోన్ మంచి స్లీక్ అండ్ కాంపాక్ట్ డిజైన్ లో ఏరో స్పేస్ స్పేస్ గ్రేడ్ అల్యూమినియం మెటల్ ఫ్రేమ్ ను కలిగి ఉంటుంది. కేవలం 0.125cm థిన్ బెజెల్ తో కూడిన OELD స్క్రీన్ తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు గొప్ప 5000 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8s Gen 3 చిప్ సెట్ కలిగి ఉంటుంది. దానికి జతగా LPDDR5X ఫాస్ట్ ర్యామ్ మరియు హెవీ UFS 4.1 స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Vivo V70 Elite price and features

ఈ లేటెస్ట్ వివో ఫోన్ (ZEISS) 50MP మెయిన్ కెమెరా, (ZEISS) అల్ట్రా వైడ్ యాంగిల్ జతగా (ZEISS) 50MP నైట్ టెలిఫోటో కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 50MP సెల్ఫీ కెమెరాని వివో అందించింది. ఇక కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్, 3x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్ మరియు 60FPS 4K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. వివో వి 70 ఎలైట్ 6500 mah బ్లూ వోల్ట్ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జ్ మరియు బైపాస్ ఛార్జ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ వివో ఫోన్ IP68 అండ్ IP69 రేటింగ్ తో మంచి డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా వస్తుంది.

Also Read: అమెజాన్ నుంచి ఈరోజు 50 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!

వివో వి70 ఎలైట్ : అంచనా ప్రైస్

ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (8 జీబీ + 256 జీబీ) ను కేవలం రూ. 51,999 ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో విడుదల చేసే అవకాశం ఉందని కొన్ని లీక్స్ చెబుతున్నాయి. అయితే, ఇది అంచనా ధర మాత్రమే మనం నోట్ చేయాలి. అంతేకాదు, ఇది అన్ని ఆఫర్స్ తో కలిపి అందించే ధర కావచ్చని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోన్ మరో రెండు రోజులో లాంచ్ అవుతుంది కాబట్టి, ఈ ఫోన్ ప్రైస్ అంచనా ప్రైస్ నిజం అవుతుందో లేదో మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo