Lava Bold N2: బిగ్ స్క్రీన్, బ్యాటరీ మరియు అదనపు ర్యామ్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

లావా లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Lava Bold N2 ను ఈరోజు రిలీజ్ చేసింది

ఈ ఫోన్ బిగ్ స్క్రీన్, బ్యాటరీ మరియు అదనపు ర్యామ్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది

లావా బోల్డ్ ఎన్ 2 స్మార్ట్ ఫోన్ మంచి ప్రీమియం గ్లాసీ బ్యాక్ డిజైన్ తో కూడా ఉంటుంది

Lava Bold N2: బిగ్ స్క్రీన్, బ్యాటరీ మరియు అదనపు ర్యామ్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!

Lava Bold N2: లావా లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు రిలీజ్ చేసింది. ఈ ఫోన్ బిగ్ స్క్రీన్, బ్యాటరీ మరియు అదనపు ర్యామ్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది. లావా బోల్డ్ ఎన్ 2 స్మార్ట్ ఫోన్ మంచి ప్రీమియం గ్లాసీ బ్యాక్ డిజైన్ తో కూడా ఉంటుంది. ఈ లావా కొత్త స్మార్ట్ ఫోన్ స్పెక్స్, ఫీచర్స్ మరియు ప్రైస్ వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Bold N2: ప్రైస్

లావా ఈ ఫోన్ ను రూ. 7,499 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇండస్ బ్లాక్ మరియు సియాచిన్ వైట్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఫిబ్రవరి 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు లావా అధికారిక సైట్ నుంచి సేల్ అవుతుంది.

Lava Bold N2: ఫీచర్స్

ఈ లావా స్మార్ట్ ఫోన్ 6.75 ఇంచ్ LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు అముఞ్చి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇందులో ఫేస్ అన్లాక్ మరియు సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ వంటి సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ Unisoc 9863A వంటి యునిసోక్ బడ్జెట్ చిప్ సెట్ పని చేస్తుంది. ఈ ఫోన్ లో 4జీబీ ఫిజికల్ ర్యామ్, 4 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 గో OS తో లాంచ్ అయ్యింది.

Lava Bold N2 Price

ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో వెనుక 13MP మెయిన్ సెన్సార్ జతగా మరో కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు 5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP 64 రేటింగ్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ గా ఉంటుంది. లావా బోల్డ్ ఎన్ 2 స్మార్ట్ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో సింగల్ స్పీకర్ మరియు 3.5mm జాక్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ తో కూడా లావా యొక్క ఉచిత హోమ్ సర్వీస్ ను ఆఫర్ చేస్తోంది.

Also Read: అమెజాన్ నుంచి ఈరోజు 50 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!

లావా బోల్డ్ ఎన్ 2 ఫోన్ గురించి ఇంపుల్ గా చెప్పాలంటే, ఇది ఒక 4G ఫోన్ గా వచ్చింది. ఈ ఫోన్ 5జి నెట్ వర్క్ కోసం తగిన ఫీచర్స్ కలిగి కేవలం బడ్జెట్ ధరలో ఉంటుంది. ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 4జి ఫోన్స్ కి మంచి పోటీగా లాంచ్ అయ్యింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo