Flipkart Down: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ సేవలకు అంతరాయం.!

HIGHLIGHTS

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ సేవలకు అంతరాయం కలిగింది

ఫ్లిప్ కార్ట్ సర్వీస్ అంతరాయం ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి యూజర్లకు తలనొప్పిగా మారింది

Flipkart Down గురించి యూజర్లు డౌన్ డిక్టేటర్ సైట్ పై రిపోర్ట్ చేశారు

Flipkart Down: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ సేవలకు అంతరాయం.!

Flipkart Down: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ సేవలకు అంతరాయం కలిగింది. దేశంలో అతిపెద్ద కామర్స్ ప్లాట్ ఫామ్ లలో ఒకటిగా వెలుగొందుతున్న ఫ్లిప్ కార్ట్ సర్వీస్ అంతరాయం ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి యూజర్లకు తలనొప్పిగా మారింది. యాప్ మరియు వెబ్సైట్ రెండు ప్రాంతాల్లో కూడా ఫ్లిప్ కార్ట్ సేవలు పని చేయడం మానేశాయి. ఇప్పుడు మరోసారి ఫ్లిప్ కార్ట్ డౌన్ అయ్యింది. ఈ విషయం గురించి యూజర్లు డౌన్ డిక్టేటర్ సైట్ పై రిపోర్ట్ చేశారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Flipkart Down: ఎప్పుడు డౌన్ అయ్యింది?

ఫ్లిప్ కార్ట్ సైట్ మరియు యాప్ ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో డౌన్ అయినట్లు యూజర్లు గమనించారు. ఈ విషయాన్ని downdetector ప్లాట్ ఫామ్ ద్వారా రిపోర్ట్ చేశారు. ఫ్లిప్ కార్ట్ డౌన్ అయినట్లు యూజర్లు చేసిన రిపోర్ట్ లో ఎక్కువగా వెబ్సైట్ సర్వీస్ లో ఎక్కువగా అంతరాయం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రిపోర్ట్ డేటా ప్రకారం, ఫ్లిప్ కార్ట్ వెబ్సైట్ లో సమస్య చూసినట్లు 82 శాతం మంది యూజర్లు రిపోర్ట్ చేయగా, 12 శాతం మంది యాప్ లో సమస్య ఉన్నట్లు మరియు 2 శాతం మంది ప్రోడక్ట్ పేజీలో సమస్య ఉన్నట్లు రిపోర్ట్ చేశారు.

Flipkart Down today

అంతేకాదు, ఈ సర్వీస్ అంతరాయం గురించి 5 గంటల నుంచి చాలా సార్లు రిపోర్ట్ చేశారు. ఇదే కాదు రాత్రి 9 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ సర్వీస్ డౌన్ గురించి మరోసారి ఎక్కువగా రిపోర్ట్ నమోదు అయ్యాయి.

Flipkart Down: కంపెనీ ఏమి చెబుతోంది?

ఫ్లిప్ కార్ట్ సైట్ మరియు సర్వీస్ లో కలిగిన అంతరాయం గురించి వివరిస్తూ కొంతమంది యూజర్లు X ప్లాట్ ఫామ్ నుండి ట్వీట్ చేశారు. ఇందులో విశాల్ యాదవ్ అనే యూజర్ ‘ఫ్లిప్ కార్ట్ మీ సైట్ మళ్ళీ డౌన్ అయ్యింది! నేను త్వరగా ఆర్డర్ చేయాలి, త్వరగా ఫిక్స్ చేయండి’ అంటూ ట్వీట్ చేశారు. ఇదే కాదు ఈ ఫ్లిప్ కార్ట్ సర్వీస్ డౌన్ గురించి ఇంకా చాలా ట్వీట్స్ X అకౌంట్ నుంచి షేర్ చేశారు. అయితే, ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ సర్వీస్ డౌన్ గురించి ఇంకా ఎటువంటి అధికారిక అప్‌డేట్ రాలేదు.

అయితే, ఇటీవల ఫ్లిప్ కార్ట్ సైట్ లో చాలా మార్పులు చేసింది. ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ను పూర్తిగా కొత్త రూపంలో మెరుపు చేసింది. ఈ కొత్త మార్పులు భాగంగా ఈ సర్వీస్ అంతరాయం కలిగి ఉండవచ్చని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అఫీషియల్ స్టేట్మెంట్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటాము కాబట్టి, అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే వరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది.

Also Read: Vivo V70 Elite: కంప్లీట్ ఫీచర్స్ అండ్ అంచనా ప్రైస్ లాంచ్ కంటే ముందే తెలుసుకోండి.!

మేము ఈ న్యూస్ అందించే సమయంలో ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ సమస్య ఉన్నట్లు గమనించాము.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo