ప్రముఖ టెలికం కంపెనీ వోడాఫోన్ ఐడియా (Vi) తన యూజర్ల కోసం నూతన సంవత్సర కానుకగా కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ లను అందించింది. ఈ ప్లాన్ లను అన్లిమిటెడ్ లాభాలతో పాటుగా ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ ఉచిత సబ్ స్క్రిప్షన్ తో కూడా అందించింది. ప్రస్తుత ఆన్లైన్ యుగంలో ఓటీటీ పైన పెరుగుతున్న మక్కువకు అనుగుణంగా ఈ కొత్త ప్లాన్ లను తీసుకు వచ్చింది.
Survey
✅ Thank you for completing the survey!
Vi new plans with OTT benefits
వోడాఫోన్ ఐడియా (వి) కొత్తగా రూ. 3,199 మరియు రూ. 3,099 ప్రీపెయిడ్ ప్లాన్ లను OTT లాభాలతో అందించింది. ఈ రెండు ప్లాన్ లు కూడా లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ లు మరియు కాలింగ్, డేటా మరియు మరిన్ని బెనిఫిట్స్ ను కూడా అందిస్తాయి. ఈ రెండు ప్లాన్ లు అందించే ప్రయోజనాలను ఇక్కడ చూడవచ్చు.
ఈ ‘వి’ రూ. 3,099 ప్రీపెయిడ్ ప్లాన్ ఒక సంవత్సరం, అంటే 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు డైలీ 100SMS సౌలభ్యం కూడా అందుతుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు వన్ ఇయర్ Disney+ Hotstar సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తోంది. Binge All Night మరియు వీకెండ్ డేటా రోలోవర్ ప్రయోజనం కూడా అందిస్తుంది.
ఈ ప్లాన్ కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 365 రోజుల అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 2GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. అలాగే, డైలీ 100SMS ప్రయోజనంతో పాటుగా వన్ ఇయర్ Prime Video మొబైల్ ఎడిషన్ సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. ఇవే కాదు, Binge All Night, Weekend data rollover మరియు Vi movies and TV ప్రయోజనాలను కూడా అందిస్తుంది.