జియో కొత్త ఆఫర్లు: ఇండిపెండెన్స్ డే సందర్భంగా 3 కొత్త అఫర్లు లాంచ్.!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 12 Aug 2022
HIGHLIGHTS
  • 2022 ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలయన్స్ జియో 3 కొత్త అఫర్లు లాంచ్ చేసింది

  • ఈ ఆఫర్లను కస్టమర్లకు అధిక ప్రయోజనాలను అందించేలా తీసుకొచ్చింది

  • అన్ని ప్లాన్ ఆఫర్లు కూడా jio అధికారిక వెబ్ సైట్ నుండి అందుబాటులో ఉండకపోవచ్చు

జియో కొత్త ఆఫర్లు: ఇండిపెండెన్స్ డే సందర్భంగా 3 కొత్త అఫర్లు లాంచ్.!
జియో కొత్త ఆఫర్లు: ఇండిపెండెన్స్ డే సందర్భంగా 3 కొత్త అఫర్లు లాంచ్.!

2022 ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలయన్స్ జియో 3 కొత్త అఫర్లు లాంచ్ చేసింది. ఈ ఆఫర్లను కస్టమర్లకు అధిక ప్రయోజనాలను అందించేలా తీసుకొచ్చింది. వాస్తవానికి, ముందుగా 2022 ఇండిపెండెన్స్ డే సందర్భంగా కేవలం 1 ప్లాన్ ను మాత్రామే జత చేసిన రిలయన్స్ జియో, ఇప్పుడు ఈ అఫర్ లో మొత్తం మూడు ప్లాన్ లను జత చేసింది. అయితే, అన్ని ప్లాన్ ఆఫర్లు కూడా jio అధికారిక వెబ్ సైట్ నుండి అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ, మీరు ఈ ప్లాన్ లను మీరు వాటిని MyJio యాప్‌లో పొందవచ్చు. మరి రిలయన్స్ జియో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా అందించిన ఆ అఫర్ వివరాలు చూద్దాం పదండి.

జియో మొదటి కొత్త అఫర్: రూ.750 ప్లాన్

రిలయన్స్ జియో యొక్క ఈ రూ.750 ప్లాన్ ఒకటి కాదు, మొత్తం రెండు ప్లాన్ ల కలయిక. ఈ ప్లాన్ ను రూ.749 ప్లాన్ మరియు రూ.1 ప్లాన్ గా చెప్పవచ్చు. ఇందులో,రూ. 749 ప్లాన్‌తో, యూజర్లు 2GB రోజువారీ డేటా (64 Kbps తర్వాత)తో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS/రోజు అలాగే Jio యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

ఇక రెండవ ప్లాన్ చూస్తే ఇది రూ.1 ప్లాన్. కేవలం 1 ప్లాన్‌తో, Jio వినియోగదారులకు 100MB డేటా (తరువాత 90 Kbps) ఇస్తుంది మరియు ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు.

జియో రెండవ కొత్త అఫర్: రూ.2,999 

జియో ఇండిపెండెన్స్ డే 2022 అఫర్ జియో యొక్క రూ.2,999  ప్రీపెయిడ్ ప్లాన్ తో అందుబాటులో వుంది. ఈ రెగ్యులర్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 912.5 GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు పూర్తిగా ఒక సంవత్సరం డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.

పైన తెలిపిన ప్రయోజనాలన్నీ కూడా ముందు నుండే ఈ ప్లాన్ తో అందుతున్నాయి. అయితే, ఈ ప్లాన్ ను ప్రస్తుతం రీఛార్జ్ చేసే వారికి 75GB అదనపు హై స్పీడ్ 4G డేటా, Ajio పై రూ. 750, Netmeds పై రూ. 750 మరియు Ixigo పై రూ. 750 తగ్గింపుతో సహా రూ. 2,250 విలువైన ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

జియో మూడవ కొత్త అఫర్:

ఇక మూడవ అఫర్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో JioFiber కస్టమర్లకు ప్రయోజనాలు అందిస్తుంది. JioFiber కొత్త కనెక్షన్‌ను ఆగస్టు 12 మరియు ఆగస్టు 16 మధ్య బుక్ చేసుకుంనే కస్టమర్‌లకు 15 రోజులకు పైగా ఉచిత సర్వీస్‌ను పొందుతారు. అయితే, ఈ అఫర్ ను పొందడం కోసం ఆగస్ట్ 19లోగా యాక్టివేషన్ పూర్తి చేయాలి. అలాగే, ఈ ఆఫర్‌ను కోరుకునే కస్టమర్‌లు రూ. 499, రూ. 599, రూ. 799 లేదా రూ. 899 యొక్క జియోఫైబర్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లకు వెళ్లవలసి ఉంటుందని గమనించండి.

మరిన్ని జియో బెస్ట్ ప్లన్స్ కోసం Click Here 

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Reliance jio launches 3 new offer for 2022 independence day
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements