Jio 5G SIM: అతిత్వరలో జియో 5G సిమ్ మార్కెట్లోకి.!

Jio 5G SIM: అతిత్వరలో జియో 5G సిమ్ మార్కెట్లోకి.!
HIGHLIGHTS

5G సిమ్‌ ను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా రిలయన్స్ జియో

నెట్‌వర్క్‌లను సజావుగా 5G కి మార్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా కంపెనీ పేర్కొంది

Reliance Jio 5G SIM భారతదేశంలో తయారు చేయబడింది మరియు త్వరలో అందుబాటులోకి రానుంది

రిలయన్స్ జియో తన మొదటి 5G సిమ్‌ ను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. వాస్తవానికి, జియో తన టెలికాం లాంచ్‌ లతో ఎప్పుడో ప్రకంనలను  సృష్టించింది. అంతేకాదు, Jio 5G SIMతో భారతదేశంలో 5G ఆపరేటెడ్ సిమ్‌ను ప్రారంభించిన మొదటి బ్రాండ్‌ లలో ఇది ఒకటి. అలాగే, నెట్‌వర్క్‌లను సజావుగా 5G కి మార్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా కంపెనీ పేర్కొంది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ప్రకారం, భారతదేశంలో ఈ సంవత్సరం చివరి నాటికి దాదాపు 13 నగరాల్లో జియో 5G సిమ్ అందుబాటులో ఉంటుంది. వాస్తవానికి, 5G లాంచ్ చేయడానికి ఇంకా ఎటువంటి నిర్ణీత తేదీ లేనప్పటికీ, 5G సిమ్ మాత్రం త్వరలో విడుదల చేయబడుతుంది. రిలయన్స్ జియో ముందుగా ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు, కోల్‌కతా, చండీగఢ్, జామ్‌నగర్, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, లక్నో, పూణే మరియు గాంధీ నగర్‌ లలో సిమ్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది.

జియో ఆఫర్ చేసిన వేగం 1Gbps కంటే ఎక్కువగా ఉంటుందని ఊహిస్తున్నారు. 5G కవరేజ్ మరియు దాని వినియోగ విధానాలను విశ్లేషించడానికి వేడి మరియు 3D మ్యాప్‌లు మరియు మరిన్ని సాంకేతికతలను ప్రతిపాదిస్తుంది. Reliance Jio 5G SIM భారతదేశంలో తయారు చేయబడింది మరియు త్వరలో అందుబాటులోకి రానుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo