రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా 103 నగరాలలో Jio True 5G సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 9 నగరాల్లో జియో 5G నెట్ వర్క్ అందుబాటులో తెచ్చింది. జియో చాలా వేగంగా తన 5G నెట్ వర్క్ ను విస్తరిస్తున్న టెలికం కంపెనీగా అవతరిస్తోంది. అంతేకాదు, త్వరలోనే దేశవ్యాపంగా మరిన్ని నగరాలలో తన 5G నెట్ వర్క్ ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
రిలయన్స్ జియో తెలుగురాష్ట్రాలలో ముందుగా హైదరాబాద్ లో తన 5G నెట్ వర్క్ ను విడుదల చేసింది. గత సంవత్సరం అక్టోబర్ లోనే హైదరాబాద్ నగరంలో జియో 5జి నెట్ వర్క్ ను లంచ్ చేసింది. తరువాత, డిసెంబర్ 2021 చివరికి ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాలైన విజయవాడ, గుంటూరు, తిరుమల మరియు విశాఖపట్నం నాలుగు నగరాలలో Jio True 5G సర్వీస్ లను లాంచ్ చేసింది. అంటే, 2022 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలలో మొత్తం 5 నగరాలలో జియో 5జి నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇక 2023 ప్రారంభమవుతూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు మరియు తిరుపతి సిటీలలో జియో 5G నెట్ వర్క్ ను లాంచ్ చేసింది. తరువాత, తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్ మరియు కరీంనగర్ రెండు నగరాలలో జియో 5జి నెట్ వర్క్ ను ప్రారంభించింది. అంటే, తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 9 నగరాల్లో జియో 5G నెట్ వర్క్ అందుబాటులో తీసుకువచ్చింది.