Jio New 2025 Plan క్లోజింగ్ డేట్ ఎక్స్టెండెడ్ చేసిన జియో.!

HIGHLIGHTS

Jio New 2025 Plan ఇప్పుడు మరి కొన్ని రోజులు కొనసాగుతుంది

ఈ జియో 2025 ప్రీపెయిడ్ ప్లాన్ 200 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది

ఈ ప్లాన్ మరిన్ని అదనపు లాభాలు అందిస్తుంది

Jio New 2025 Plan క్లోజింగ్ డేట్ ఎక్స్టెండెడ్ చేసిన జియో.!

Jio New 2025 Plan ఇప్పుడు మరికొన్ని రోజులు కొనసాగుతుంది. 2025 కొత్త సంవత్సరం కోసం తీసుకు వచ్చిన ఈ లాంగ్ వ్యాలిడిటీ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ సమయంలో ఈ ప్లాన్ ను జనవరి 11 వ తేదీతో నిలిపి వేస్తుందని ప్రకటించింది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్ల నుంచి అందుకున్న స్పందన కారణంగా మరిన్ని రోజులు ఈ ప్లాన్ ను కొనసాగిస్తున్నట్లు చెబుతోంది. ఈ జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం యూజర్లకు అందుబాటులో ఉంచింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio New 2025 Plan

జియో 2025 న్యూ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ ముందుగా జనవరి 11 వరకు మాత్రమే అందుబాటులో ఉండే లిమిటెడ్ ప్లాన్ గా వచ్చింది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను జనవరి 31 వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు జియో చెబుతోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ లాభాలతో పాటు అదనపు క్యాష్ బ్యాక్ లాభాలు కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను జనవరి 31వ తేదీ వరకు యూజర్లు రీఛార్జ్ చేసుకోవచ్చు.

Also Read: Sony BRAVIA 2 పై అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి జబర్దస్త్ ఆఫర్ అందించింది.!

Jio New 2025 Plan : ప్రయోజనాలు

ఈ జియో 2025 ప్రీపెయిడ్ ప్లాన్ 200 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 200 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ డేటాని ఎంజాయ్ చేయవచ్చు. ఇది మాత్రమే కాదు ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు డైలీ 100SMS మరియు 4జి నెట్ వర్క్ పై డైలీ 2.5GB డేటా కూడా అందుకుంటారు.

Jio New 2025 Plan

పైన తెలిపిన ప్రయోజనాలతో పాటు మరిన్ని అదనపు లాభాలు అందిస్తుంది. అవేమిటంటే, ఈ ప్లాన్ రీఛార్జ్ చేసే యూజర్లు Easy My Trip పై చేసే ఫ్లైట్ టికెట్ బుకింగ్ పై గరిష్టంగా రూ. 1,500 తగ్గింపు, Ajio పై చేసే షాపింగ్ (మినిమం రూ. 2999) రూ. 500 తగ్గింపు మరియు Swiggy ఆర్డర్స్ పై రూ. 150 తగ్గింపు అందిస్తుంది. ఈ ప్లాన్ తో రూ. 2,150 రూపాయల అదనపు ప్రయోజనాలు జియో అందిస్తుంది.

మరిన్ని జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo