Jio 5G: దేశంలో శరవేగంగా తన 5G నెట్ వర్క్ ను విస్తరిస్తున్న రిలయన్స్ జియో ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లోని మరిన్ని సిటీలలో తన 5G నెట్ వర్క్ ను లాంచ్ చేసింది. వీటిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఒకసిటీ ఉండగా తెలంగాణ రాష్ట్రంలోని 8 నగరాలు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా Jio 5G సేవలు అందుబాటులోకి వచ్చిన మొత్తం సిటీలు ఇప్పుడు 331 కి చేరుకున్నాయి.
Survey
✅ Thank you for completing the survey!
ఇప్పటికే తెలుగురాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ మరియు వైజాగ్ తో సహా చాలా నగరాలలో జియో 5G సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిదే తెలిసిందే. అయితే, ఇప్పుడు మరియని సిటీలను ఈ జాబితాలో చేర్చింది.
ఇక లేటెస్ట్ 5G నెట్ వర్క్ అందుకున్న సిటీల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ లోని తాడిపత్రి సిటీలో జియో 5G సేవలు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల, కోదాడ, కొత్తగూడెం, నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట,తాండూర్ మరియు జహీరాబాద్ నగరాలలో Jio True 5G సర్వీస్ లు మొదలయ్యాయి. అంటే, ఈ సిటీలలోని జియో కస్టమర్లు వేగవతమైన Jio 5G సర్వీస్ ను అందించవచ్చు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.
ఈ నగరాల్లోని ప్రజలు 'JIO WELCOME OFFER' అఫర్ లో భాగంగా 1Gbps+ స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాని పొందుతారని కూడా జియో వెల్లడించింది. దీనికోసం My Jio App నుండి 5G ఎనేబుల్ కోసం అధ్యర్ధన నమోదు చెయ్యవలసి ఉంటుంది.
మీరు Jio True 5G సేవలను వినియోగించుకోవడానికి మీ సిమ్ కార్డును మార్చవలసిన అవసరం లేదు మరియు ఈ సర్వీసులను మీ 4G సిమ్ కార్డ్ పైనే ఆనందించవచ్చు. అంతేకాదు, 4G ప్లాన్స్ పైనే మీరు 5G ని ఎంజాయ్ చేయవచ్చు. ఇక మీ 5G ఫోన్ లో 5G నెట్ వర్క్ సెట్ చేసుకోవడానికి, ఫోన్ మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి,సిమ్ కార్డు ఎంచుకొన్న తరువాత 'Preferred network type' అప్షన్ ను ఎంచుకోండి. ఇక్కడ మీకు నెట్ వర్క్ టైప్ (3G,4G,5G) చూపిస్తుంది. మీ నెట్ వర్క్ టైప్ ను 5G గా ఎంచుకోండి మరియు మీకు 5G నెట్ వర్క్ ఎనేబుల్ అవుతుంది.