జియో గుడ్ న్యూస్: సూపర్ బెనిఫిట్స్ తో కొత్త ప్లాన్స్ ప్రకటన

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 31 Aug 2021
HIGHLIGHTS
  • రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

  • డిస్నీ+ హాట్ స్టార్ కి అన్ రిస్ట్రిక్టెడ్ యాక్సెస్

  • ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా యాక్సెస్ లభిస్తుంది

జియో గుడ్ న్యూస్: సూపర్ బెనిఫిట్స్ తో కొత్త ప్లాన్స్ ప్రకటన
జియో గుడ్ న్యూస్: సూపర్ బెనిఫిట్స్ తో కొత్త ప్లాన్స్ ప్రకటన

రిలయన్స్ జియో తన కస్టమర్లకు అధికలాబాలను తీసుకువచ్చే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ తో పాటుగా డిస్నీ+ హాట్ స్టార్ కి అన్ రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ను కూడా తీసుకువస్తాయి. అంటే, ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసే జియో కస్టమర్లకు ఎటువంటి పరిమితి లేకుండా డిస్నీ+ ఒరిజినల్,టీవీ షో లు, HBO, Marvel StarWars వంటి చాలా వాటికీ ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా యాక్సెస్ లభిస్తుంది. మరి సూపర్ బెనిఫిట్స్ తీసుకువచ్చే ఆ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ చూద్దామా...!

జియో యొక్క కొత్త ప్లాన్స్:

జియో తన కొత్త ప్లాన్స్ ను 1 నెల వ్యాలిడిటీ మొదలుకొని 1 సంవత్సరం వరకు వ్యాలిడిటీతో అందించింది.

1.రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 3జిబి హై స్పీడ్ డేటా లాభాలను 28 రోజుల వ్యాలిడిటీ తో తీసుకువస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలవిషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు డిస్నీ+ హాట్ స్టార్ VIP యాక్సెస్ లభిస్తుంది. 3GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 84 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

2.రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 2జిబి హై స్పీడ్ డేటా లాభాలను 56 రోజుల వ్యాలిడిటీ తో తీసుకువస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలవిషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు డిస్నీ+ హాట్ స్టార్ VIP యాక్సెస్ లభిస్తుంది. 2GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 112 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

3.రూ.888 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ రూ.888 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 2 జిబి హై స్పీడ్ డేటా లాభాలను 84 రోజుల వ్యాలిడిటీ తో తీసుకువస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలవిషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు డిస్నీ+ హాట్ స్టార్ VIP యాక్సెస్ లభిస్తుంది. 2GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 168 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

అలాగే, రూ. 549 యాడ్ ఆన్ ప్యాక్ తో కూడా ఈ డిస్నీ+ హాట్ స్టార్ VIP ని చేసింది మరియు ఇది రోజుకు 1.5జిబి హాయ్ స్పీడ్ డేటా తో 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాదు, ఇప్పటికే అందుబాటులో ఉన్న 1 సంవత్సరం ప్లాన్ రూ.2599 తో కూడా ఈ డిస్నీ+ హాట్ స్టార్ VIP ప్రయోజనాన్ని జతచేసింది.    

ఇక ఈ రిలయన్స్ జియో యొక్క లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ విషయానికి వస్తే, ఇది పూర్తి సంవత్సరం వ్యాలిడిటీని అందిస్తుంది. జియో యొక్క ఈ ప్లానుతో అన్ని నెట్వర్కులకు  అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS,  మరియు 365 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఈ ప్లానుతో మీకు డైలీ 2 GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 730 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. అధనంగా, 399 రుపాయల విలువగల Disney+ Hotstar VIP సంవత్సరం సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది.

మరిన్ని Jio ప్లాన్స్ కోసం ఇక్కడ Click చేయండి.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: jio launches new plans with unrestricted disney plus hotstar
Tags:
jio Reliance jio Jio 4G Disney+ Hotstar VIP jio hotstar jio disney + hotstar jio new prepaid plans జియో
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status