Motorola Edge 50 Fusion లాంచ్ డేట్ తో పాటు కీలక ఫీచర్స్ అనౌన్స్ చేసిన కంపెనీ.!

Motorola Edge 50 Fusion లాంచ్ డేట్ తో పాటు కీలక ఫీచర్స్ అనౌన్స్ చేసిన కంపెనీ.!
HIGHLIGHTS

Motorola Edge 50 Fusion లాంచ్ డేట్ తో పాటు కీలక ఫీచర్స్ అనౌన్స్ చేసింది

50MP Sony - LYTIA 700C సెన్సార్ కెమెరా తో తీసుకొస్తున్నట్లు తెలిపింది

ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 2 ప్రోసెసర్ తో వస్తుంది

మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Motorola Edge 50 Fusion లాంచ్ డేట్ తో పాటు కీలక ఫీచర్స్ ను కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను 16 May 2024 తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేస్తున్నట్లు మోటోరోలా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను సెగ్మెంట్ బెస్ట్ 50MP Sony – LYTIA 700C సెన్సార్ కెమెరా తో తీసుకొస్తున్నట్లు తెలిపింది.

Motorola Edge 50 Fusion

మోటోరోలా అప్ కమింగ్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ ని కన్ఫర్మ్ చేసిన కంపెనీ ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా వెల్లడించింది. ఈ ఫోన్ లో అందించిన డిస్ప్లే, కెమెరా మరియు మరిన్ని ఇతర కీలకమైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

Also Read: Google Pixel 8a: Google AI పవర్ తో వచ్చిన గూగుల్ ఫోన్.!

Motorola Edge 50 Fusion: ఫీచర్స్

మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను 6. 7 ఇంచ్ 3D Curved pOLED డిస్ప్లేతో అందిస్తున్నట్లు తెలిపింది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు DCI-P3 కలర్ గెమూట్ ఫీచర్స్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 2 ప్రోసెసర్ తో పని చేస్తుందని మరియు జతగా 12GB వరకు RAM ఉంటుందని కోడోత్ మోటోరోలా తెలిపింది.

Motorola Edge 50key specs
Motorola Edge 50key specs

ఈ ఫోన్ IP68 అండర్ వాటర్ ప్రొటెక్షన్ తో కూడా వస్తోంది. ఈ ఫోన్ లో 2μm అల్ట్రా పిక్సెల్ కలిగిన 50MP Sony – LYTIA 700C మెయిన్ కెమెరాతో వస్తుంది. దీనికి జతగా 13MP (అల్ట్రా వైడ్ + మ్యాక్రో) సెన్సార్ కూడా వుంది. ఈ కెమెరాతో 30fps వద్ద 4K వీడియో లను షూట్ చేయవచ్చని తెలిపింది. అలాగే, ముందు 32 సెల్ఫీ కెమెరా ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది.

ఈ ఫోన్ యొక్క ఇతర ఫీచర్స్ ను కూడా కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ను 68W టర్బో పవర్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉన్నట్లు క్లియర్ గా తెలిపింది. ఈ మోటోరోలా ఫోన్ ఫారెస్ట్ బ్లూ, మార్ష్మెల్లో బ్లూ మరియు హాట్ పింక్ అనేది మూడు కలర్ ఆప్షన్ లలో లాంచ్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo