AI ఇంపాక్ట్ సమ్మిట్ లో చైనా రోబోట్ ప్రదర్శించి అభాసుపాలైన Galgotias University
India AI Impact Summit 2026 లో చోటు చేసుకున్న ఒక వింత సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది
Galgotias University అందించిన రోబోట్ ఆ యూనివర్సిటీది కాదని తేలడంతో అభాసుపాలు
AI రంగంలో పారదర్శకత మరియు స్వదేశీ ఆవిష్కరణల ప్రాముఖ్యత పై పెద్ద చర్చకు దారి తీసేలా చేసింది
India AI Impact Summit 2026 లో చోటు చేసుకున్న ఒక వింత సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ నోయిడాకు చెందిన Galgotias University ఈ అతిపెద్ద ఏఐ సమ్మిట్ లో తమ టెక్ ప్రదర్శన కోసం అందించిన పావిలియన్ నుంచి “Orion” పేరుతో ఒక రోబోటిక్ డాగ్ ను ప్రదర్శించింది. అయితే, అది ఈ యూనివర్సిటీ అందించిన రోబోట్ కాదని తేలడంతో ఈ యూనివర్సిటీ అభాసుపాలు అయ్యింది. వాస్తవానికి, ఇది ప్రముఖ చైనా కంపెనీ తయారు చేసిన రోబోట్ అనే నిజం బయటపడింది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ అతిపెద్ద ఏఐ సమ్మిట్ లో ఇలాంటి సంఘటన జరగడం AI రంగంలో పారదర్శకత మరియు స్వదేశీ ఆవిష్కరణల ప్రాముఖ్యత పై పెద్ద చర్చకు దారి తీసేలా చేసింది.
SurveyGalgotias University Orion రోబో అసలు కథ ఏమిటి?
ఇండియా నిర్వహిస్తున్న అతిపెద్ద ఏఐ సమ్మిట్ నుంచి గల్గోటియాస్ యూనివర్సిటీ ఓరియన్ అనే రోబోట్ ను ప్రదర్శించింది. ఈ సమ్మిట్ సమయంలో తీసిన ఒక వీడియోలో యూనివర్సిటీ ప్రతినిధి ఈ రోబోట్ ను వారి ‘సెంటర్ ఆఫ్ఎక్సెలెన్స్’ అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే వాస్తవానికి ఈ రోబోట్ చైనా కంపెనీ Unitree Robotics తయారు చేసిన Unitree Go2 మోడల్ గా గుర్తించబడింది. విదేశీ కంపెనీ ఏఐ టెక్ ను ఒక ప్రముఖ యూనివర్సిటీ తమ సొంత టెక్ గా చెప్పుకోవడం హాస్యాస్పదం, అని టెక్ కమ్యూనిటీ మరియు నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందించారు.

మెల్లగా మొదలైన ఈ చర్చ తీవ్రత పెరిగి పెద్ద వివాదంగా మారడంతో సమ్మిట్ నిర్వాహకులు ఈ గల్గోటియాస్ యూనివర్సిటీ పావిలియన్ ను ఖాళీ చేయమని సూచించినట్లు రిపోర్టులు వెలువడ్డాయి. ఇది భారత్ నిర్వహిస్తున్న ఈ AI సమ్మిట్ అంతర్జాతీయ వేదికలో ఒక ముఖ్యమైన ఘటన గా మారింది.
Galgotias University : ఏమి చెబుతోంది?
ఇక ఈ వీడియో మరియు వైరల్ న్యూస్ పై స్పందించిన యూనివర్సిటీ ప్రతినిధులు. గ్లోబల్ టెక్నాలజీ ని విద్యార్థులు అర్థం చేసుకునేందుకు వీలుగా ఈ కొత్త ఏఐ రోబోట్ ను ప్రదర్శనలో చూపినట్లు యూనివర్సిటీ ప్రతినిధులు క్లారిఫై చేశారు.
ఈ ఘటన వలన భారత్ కు కలిగే నష్టం ఏమిటి?
భారతదేశం ప్రస్తుతం AI రంగంలో భారీ పెట్టుబడులు పెడుతోంది. ఇటువంటి సమయంలో ఇలాంటి వివాదాలు తలెత్తితే దేశీయ R&D ప్రతిష్ట పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
Also Read: Infinix Note Edge 5G: బడ్జెట్ ధరలో భారీ ఫీచర్స్ తో వచ్చింది.. ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!
ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
నిజానికి AI వంటి సున్నితమైన రంగంలో ప్రోడక్ట్ మూలం (ఆరిజిన్) స్పష్టంగా తెలియజేయడం చాలా ముఖ్యం. అంతేకాదు, అంతర్జాతీయ వేదిక లో ఏదైనా టెక్ ప్రదర్శనలు చేసేటప్పుడు ఆ టెక్ లేదా ప్రోడక్ట్ గురించి సమాచారం ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
ప్రదర్శించిన Unitree Go2 ప్రత్యేకతలు ఏమిటి?
ఈ రోబోట్ నాలుగు కాళ్లపై నడిచే AI ఆధారిత క్వాడ్రుపెడ్ మెషీన్. ఇది AI విజన్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ రోబోట్ ఆటోనమస్ నావిగేషన్ చేయగలదు. ముఖ్యంగా ఈ రోబోట్ ఇండస్ట్రియల్ ఇన్‌స్పెక్షన్ మరియు రీసెర్చ్ అవసరాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో 360° AI కెమెరా సిస్టమ్, అడ్డంకులను గుర్తించి స్పాంటేనియస్ దాటగలిగే సామర్థ్యం మరియు రిమోట్ కంట్రోల్ అండ్ ఆటోమేటిక్ మోడ్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile