Infinix Note Edge 5G: బడ్జెట్ ధరలో భారీ ఫీచర్స్ తో వచ్చింది.. ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!
ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు ఈరోజు విడుదల చేసింది
Infinix Note Edge 5G ఫోన్ ను బడ్జెట్ ధరలో భారీ ఫీచర్స్ తో లాంచ్ చేసింది
లేటెస్ట్ సాఫ్ట్ వేర్ మరియు భారీ బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో ఇండియాలో అడుగుపెట్టింది
Infinix Note Edge 5G: ఇన్ఫినిక్స్ గత కొంత కాలంగా టీజింగ్ చేస్తున్న ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు ఈరోజు విడుదల చేసింది. ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో భారీ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ గొప్ప డిజైన్, కర్వుడ్ స్క్రీన్, లేటెస్ట్ సాఫ్ట్ వేర్ మరియు భారీ బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో ఇండియాలో అడుగుపెట్టింది. ఈ లేటెస్ట్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.
SurveyInfinix Note Edge 5G: ప్రైస్ అండ్ ఫీచర్స్
ఇన్ఫినిక్స్ ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను మొత్తం మూడు వేరియంట్స్ మరియు మూడు కలర్ వేరియంట్స్ లో అందించింది. ఈ రెండు వేరియంట్ ప్రైస్ డిటైల్స్ ఇక్కడ చూడవచ్చు
ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ (6 జీబీ + 128 జీబీ) ప్రైస్ : రూ. 21,999
ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ (8 జీబీ + 128 జీబీ) ప్రైస్ : రూ. 23,999
ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ (8 జీబీ + 256 జీబీ) ప్రైస్ : రూ. 25,999
ఈ ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ సిల్క్ గ్రీన్, స్టెల్లార్ బ్లూ మరియు పింక్ కలర్ లో లభిస్తుంది.

ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై గొప్ప బ్యాంక్ అండ్ ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ ను ICICI మరియు SBI బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ లేదా ఎక్స్ చేంజ్ ఆఫర్ తీసుకునే వారికి రూ. 2,000 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ అందిస్తుంది. ఫిబ్రవరి 25 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ స్టార్ట్ అవుతుంది.
Also Read: Nothing Phone (4a) Series ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన నథింగ్.!
Infinix Note Edge 5G: ఫీచర్స్
ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5జి స్మార్ట్ ఫోన్ కేవలం 7.2mm స్లీక్ అండ్ కర్వుడ్ స్టైలిష్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ 6.78 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్, TUV బ్లూ లైట్ వెరిఫికేషన్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి అదనపు ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. అదనంగా, ఈ ఫోన్ గొరిల్లా గ్లాస్ 7i గ్లాస్ తో మంచి స్క్రీన్ సేఫ్టీ కూడా కలిగి ఉంది.
ఈ ఇన్ఫినిక్స్ లేటెస్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7100 5G చిప్ సెట్ తో నడుస్తుంది. ఇది లేటెస్ట్ 5జి ప్రోసెసర్ మరియు 7,50,000 కంటే ఎక్కువ AnTuTu స్కోర్ అందిస్తుంది. ఈ ఫోన్ 8 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఇన్ఫినిక్స్ UI XOS 16 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది.
ఈ లేటెస్ట్ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరాతో లాంచ్ అయ్యింది. ఇందులో 50MP మెయిన్ కెమెరా జతగా మరో కెమెరా ఉన్నాయి. అలాగే, ఈ ఫోన్ ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా ఉంది. లైవ్ ఫోటో మోడ్ తో ఇన్ఫినిక్స్ నుంచి వచ్చిన మొదటి ఫోన్ ఇదే అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో AI కెమెరా ఫీచర్స్, AIGC పోర్ట్రైట్ మోడ్ మరియు 10x జూమ్ వంటి చాలా కెమెరా ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ఈ ఫోన్ లో 6500mAh బిగ్ బ్యాటరీని ఇన్ఫినిక్స్ అందించింది మరియు జతగా 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, కూడా అందించింది. అదనంగా ఈ ఫోన్ లో బైపాస్ ఛార్జ్ సపోర్ట్ అందించడం విశేషం. ఈ ఫోన్ లో JBL సౌండ్ ట్యూన్డ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు HiRes ఆడియో ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile