Nothing Phone (4a) Series ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన నథింగ్.!

HIGHLIGHTS

Nothing Phone (4a) Series ఇండియాలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ కోసం కంపెనీ ఇప్పుడు డేట్ అండ్ టైం ను ప్రకటించింది

సాధారణ మోడల్ మొదలుకొని Pro మోడల్స్ వరకు ఫోన్లు ఉంటాయని మనం ఆశించవచ్చు

Nothing Phone (4a) Series ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన నథింగ్.!

Nothing Phone (4a) Series ఇండియాలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ కోసం కంపెనీ ఇప్పుడు డేట్ అండ్ టైం ను ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ నుంచి సాధారణ మోడల్ మొదలుకొని Pro మోడల్స్ వరకు ఫోన్లు ఉంటాయని మనం ఆశించవచ్చు. అంటే, ఇందులో మిడ్ రేంజ్ నుంచి ప్రీమియం వరకు అన్ని సెగ్మెంట్ ఫోన్లు ఉంటాయి. ఈ అప్ కమింగ్ నథింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ డేట్ మరియు ఈ ఫోన్ పై ఆన్లైన్ లో లీకైన లేదా అంచనా ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nothing Phone (4a) Series : ఎప్పుడు లాంచ్ అవుతుంది?

మార్చి 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు నథింగ్ ఫోన్ 4a సిరీస్ ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ సిరీస్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ కూడా మొదలు పెట్టింది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ డేట్ అనౌన్స్ కావడంతో ఈ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్స్ లీక్ పోస్టులు X అకౌంట్ నుంచి వెల్లువెత్తాయి. వాటి ద్వారా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ అంచనా ఫీచర్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Nothing Phone (4a) Series : అంచనా ఫీచర్స్

నథింగ్ ఫోన్ 4a సిరీస్ ఫోన్లు కూడా గత సిరీస్ ఫోన్లు మాదిరిగా గిఫ్ లైట్ బ్యాక్ తో ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ సిరీస్ ఫోన్లు మరింత ఆకర్షణీయంగా ఉండే కొత్త డిజైన్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్ ను క్వాల్కమ్ లేటెస్ట్ మిడ్ రేంజ్ చిప్ సెట్ Snapdragon 7s Gen 4 చిప్ సెట్ తో లాంచ్ చేసే అవకాశం ఉందని చాలా కాలంగా వచ్చిన లీక్స్ తెలిపాయి.

Nothing Phone (4a) Series Launch

ఈ సిరీస్ ఫోన్లలో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన OLED స్క్రీన్ ఉంటుంది. ఇది యెప్పటి వరకు ఫాలో అయిన ఫ్లాట్ స్క్రీన్ మోడల్ ను ఈ ఫోన్ సిరీస్ లో కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ స్క్రీన్ HDR 10+ సపోర్ట్ మరియు గొప్ప బ్రైట్నెస్ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ సిరీస్ ఫోన్లు లేటెస్ట్ నథింగ్ OS అఙాతగ్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ కావచ్చు. ఈ నథింగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో పెరిస్కోప్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు మంచి సెల్ఫీ కెమెరా సెటప్ కూడా ఉండవచ్చు.

Also Read: కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ లో ఈరోజు లభిస్తున్న బెస్ట్ Dolby Audio సౌండ్ బార్ డీల్స్.!

ఈ అప్ కమింగ్ నథింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఫోన్లు 5000 mAh లేదా అంత కంటే పెద్ద బ్యాటరీ కలిగి ఉండే అవకాశం ఉందని కూడా లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది కాబట్టి త్వరలోనే ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా కంపెనీ ఒక్కొక్కటిగా వెల్లడించే అవకాశం ఉంది. కంపెనీ అఫీషియల్ గా ఫీచర్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ అంచనా ఫీచర్స్ లో ఎన్ని నిజం అవుతాయి అని చూడాలి.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo