జియో లేటెస్ట్ ప్లాన్: రూ.75 కే అన్లిమిటెడ్ కాలింగ్ మరియు హై స్పీడ్ డేటా

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 20 Sep 2021
HIGHLIGHTS
  • అతి తక్కువ ధర ఆల్ ఇన్ ఇన్ వన్ ప్లాన్

  • అన్లిమిటెడ్ సర్వీస్

  • 200 MB అదనపు డేటా

జియో లేటెస్ట్ ప్లాన్: రూ.75 కే అన్లిమిటెడ్ కాలింగ్ మరియు హై స్పీడ్ డేటా
జియో లేటెస్ట్ ప్లాన్: రూ.75 కే అన్లిమిటెడ్ కాలింగ్ మరియు హై స్పీడ్ డేటా

జియో యొక్క రూ.75 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ను జియోఫోన్ యూజర్ల కోసం ప్రకటించింది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 0.1GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 50 SMS లు మరియు జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ ని తీసుకువస్తుంది. అధనంగా, 200 MB అదనపు డేటాను అందిస్తుంది. ఈ ఇదే అతి తక్కువ ధర ఆల్ ఇన్ ఇన్ వన్ ప్లాన్ అవుతుంది. ముందుగా అందుబాటులో ఉంచిన రూ.39 మరియు రూ.69 ప్లాన్ లను తోలగించింది.

ఇక జియోఫోన్ బెస్ట్ ఆఫర్ల విషయానికి వస్తే, జియోఫోన్ 2021 ఆఫర్ తో జియోఫోన్ ను ఒకేసారి 24 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ తో సహా కేవలం 1,999 రూపాయలకు అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా, ఈ అఫర్ ఎంచుకునే కొత్త చందాదారులకు రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజూ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు నెలకు 2 జిబి హై-స్పీడ్ డేటాతో సహా అనేక ప్రయోజనాలు అందుతాయి. అధనంగా, జియోఫోన్ ఉచితంగా లభిస్తుంది.

అంతేకాదు, పైన తెలిపిన అన్లిమిటెడ్  ప్రయోజనాలతో  కేవలం ఒక్క సంవత్సరం వ్యాలిడిటీ మాత్రమే కోరుకుంటే, రిలయన్స్ జియో యొక్క జియోఫోన్ 2021 ఆఫర్ కింద ఒక సంవత్సరం ప్లాన్ కూడా అందిస్తోంది. దీని కోసం, చందాదారులు సింగిల్ పేమెంట్ క్రింద రూ .1,499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో, ఉచిత జియోఫోన్ మరియు 12 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ అందుకోవచ్చు. ఇందులో, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు నెలకు 2 జిబి హై-స్పీడ్ డేటా 12 నెలలకు ఉంటాయి.

అదనంగా, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారుల కోసం కూడా ఒక ప్లాన్ ప్రకటించింది. దీనితో, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారులు సంవత్సరానికి 2GB రోజువారీ డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. ఇవన్నీ కూడా మరింత కేవలం 749 రూపాయల అఫర్ ధరకే  పొందవచ్చు. అయితే, ప్లాన్ తో జియోఫోన్ మాత్రం రాదు. ఇప్పటికే ఉన్న JioPhone నంబర్లలో మాత్రమే ఈ ప్లాన్ యాక్సెస్ చేయబడుతుంది.

మరిన్ని జియో ఆఫర్స్ కోసం Click Here

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: jio launches new all in one plan jio phone users
DMCA.com Protection Status